Rajya Sabha Elections: పోటీ లేకుండానే విక్టరీ.. రాజ్యసభ ఎన్నికల్లో 26 స్థానాలు ఏకగ్రీవం.. మూడు రాష్ట్రాల్లో మాత్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajya Sabha Elections: దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు పోటీ లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవమైన వారిలో శరద్ పవార్ (NCP), రాందాస్ అథవాలే, అభిషేక్ మను సింఘ్వి, తంబి దురై, వినోద్ తవ్డే, బాబుల్ సుప్రియో వంటి దిగ్గజ నేతలు ఉన్నారు. అయితే, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో మాత్రం అభ్యర్థులు బరిలో ఉండటంతో పోలింగ్ అనివార్యమైంది.
READ ALSO: UAE: యుఏఈలో 35 మంది అరెస్టుకు ఆదేశం.. మెజారిటీ భారతీయులే!
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
బీహార్: కుష్వాహా వర్సెస్ ఏడీ సింగ్
బీహార్‌లో ఐదు స్థానాలకు గాను నితీష్ కుమార్, రామ్‌నాథ్ ఠాకూర్ (JDU), నితిన్ నబిన్, శివం కుమార్ (BJP) విజయం ఖాయమైంది. అయితే, ఐదో సీటు కోసం ఎన్డీయే అభ్యర్థి ఉపేంద్ర కుష్వాహా, మహాఘటబంధన్ అభ్యర్థి ఏడీ సింగ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ సీటును గెలవడానికి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, ప్రస్తుతం విపక్ష కూటమికి 35 మంది ఉన్నారు. తేజస్వి యాదవ్‌కు మద్దతుగా AIMIM ఎమ్మెల్యేలు నిలవడంతో పోరు ఆసక్తికరంగా మారింది.
ఒడిశా: క్రాస్ ఓటింగ్‌పైనే ఆశలు!
ఒడిశాలో ఒక సీటు గెలవడానికి 30 ఓట్లు అవసరం. ఇక్కడ బీజేపీకి ఇద్దరు, బీజేడీకి ఒక అభ్యర్థి విజయం సులభమే. కానీ, బీజేపీ మద్దతుతో బరిలో ఉన్న దిలీప్ రే గెలవాలంటే మరో 8 ఓట్లు అదనంగా కావాలి. కాంగ్రెస్, బీజేడీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారనే నమ్మకంతో బీజేపీ వర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, సీపీఎం కలిసి 33 ఓట్లతో ఒక స్థానాన్ని గెలుచుకునే స్థితిలో ఉన్నాయి.
హర్యానా: క్యాంప్ రాజకీయాలు షురూ!
హర్యానాలో బీజేపీ అభ్యర్థి సంజయ్ భాటియా, కాంగ్రెస్ అభ్యర్థి కరంవీర్ బోధ్ గెలుపు దాదాపు ఖాయం. కానీ, స్వతంత్ర అభ్యర్థి సతీష్ నందల్ రంగంలోకి దిగడంతో సమీకరణాలు మారాయి. క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయంతో కాంగ్రెస్ తన 31 మంది ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్‌కు తరలించింది. అయితే, భూపిందర్ సింగ్ హుడా, వినేష్ ఫోగట్ సహా ఆరుగురు ఎమ్మెల్యేలు ఈ క్యాంప్‌కు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది.
నేడు (సోమవారం) జరగనున్న పోలింగ్‌లో ఈ మూడు రాష్ట్రాల ఫలితాలు ఎవరిని వరిస్తాయనేది ఉత్కంఠ రేపుతోంది. క్రాస్ ఓటింగ్ జరిగితే ఫలితాలు తలకిందులయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!