Home
Todays Updates
Todays Updates News
-
Cent Percent Work From Home: అక్కడ మళ్లీ వంద శాతం వర్క్ ఫ్రం హోం?
Cent Percent Work From Home: స్పెషల్ ఎకనమిక్ జోన్ యూనిట్లలో 100 శాతం ‘వర్క్ ఫ్రం హోం’ కావాలంటున్న ఇండస్ట్రీ డిమాండ్‌ను పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదన వల్ల చిన్న సిటీల్లో ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుపడుతుందని, సర్వీసుల ఎగుమతులు పెరుగుతాయని కూడా అంచనా వేస్తున్నట్లు తెలిపింది. -
Shock News to Samsung: శామ్‌సంగ్‌కి కేంద్ర ప్రభుత్వం షాక్
Shock News to Samsung: శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక పథకం కింద ఇవ్వాల్సిన 900 కోట్ల రూపాయలను నిలిపేసింది. ఆ కంపెనీ జనరేట్ చేసిన ఇన్‌వాయిస్‌లలో కొన్ని లోటుపాట్లు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ మరియు సేల్స్‌కి సంబంధించి శామ్‌సంగ్ ఇచ్చిన డేటాకి, కేంద్ర ప్రభుత్వం సేకరించిన సమాచారానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. -
Kakatiya Mega Textile Park: చేనేత కార్మికుల ఆరేళ్ల కల.. నెరవేరిన వేళ. కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ త్వరలో ప్రారంభం
Kakatiya Mega Textile Park: కాకతీయ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ ఆరేళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో చీరల తయారీ ప్రారంభమైంది. ఈ పార్క్‌ను చేనేత మరియు జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది. హన్మకొండ జిల్లా మడికొండ గ్రామంలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఈ పార్క్‌ను 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అక్కడ 364కి పైగా పవర్ లూమ్ యూనిట్లు ఉన్నాయి. -
Ravi Narain-Bhagavad Gita: భగవద్గీత, కళ్లజోడు కావాలన్న రవి నరైన్. చిత్రా రామకృష్ణ సహా ఆ ముగ్గురికి 21 వరకు జ్యుడిషియల్ కస్టడీ
Ravi Narain-Bhagavad Gita: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ, మాజీ ఎండీ రవి నరైన్‌తోపాటు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ కోర్టులో ఛార్జ్‌షీట్లు దాఖలుచేసింది. అనంతరం ఈ ముగ్గురి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 21వ తేదీకి పొడిగించింది. ఇదిలా ఉండగా తనకు భగద్గీతతోపాటు మరో పుస్తకాన్ని, కళ్లజోడును అందించాలని రవి నరైన్ న్యాయస్థానానికి విజ్జప్తి చేశారు. -
Telangana-Amazon Tie up: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అమేజాన్ వెబ్ సర్వీసెస్ టైఅప్
Telangana-Amazon Tieup: అమేజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. మరింత ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా పౌర సేవల రంగంలో సమూల మార్పులు తేనుంది. కంప్యూటింగ్, స్టోరేజ్, మేనేజ్మెంట్, గవర్నెన్స్ క్యాపబిలిటీస్‌లో అమేజాన్ వెబ్ సర్వీసెస్ సొల్యూషన్స్‌ను వినియోగించనున్నారు. -
IKEA India New Idea: మా ఇంటికి వచ్చి వెళ్లండి అంటూ సాదరంగా ఆహ్వానిస్తున్న ఐకియా ఇండియా. ఇదో కొత్త ఐడియా
IKEA India New Idea: ఐకియా ఇండియా సరికొత్త ఐడియాను అమలుచేస్తోంది. ‘‘ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్లండి’’ అంటూ వినూత్న ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా మా స్టోర్‌కి రండి అని సాదరంగా ఆహ్వానిస్తోంది. రెడీమేడ్ ఫర్నీచర్‌ను విక్రయించే ఈ సంస్థ ‘ఘర్ ఆ జావో’ పేరుతో కొత్త బ్రాండ్ పొజిషనింగ్‌ని ప్రారంభించినట్లు వెల్లడించింది. వినియోగదారులతో భావోద్వేగపూరితమైన మరియు హేతుబద్ధమైన అనుబంధాన్ని ఏర్పరచుకునేందుకు ఈ క్యాంపెయిన్‌ని వివిధ ప్రచార మాధ్యమాల్లో -
Perks cut in Google: కొంత మంది గూగుల్ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు కట్!
Perks cut in Google: టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థగా వెలుగొందుతున్న గూగుల్‌లో కొంత మంది ఉద్యోగుల ప్రోత్సాహకాలకు కోతపడనున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతే తప్ప బిజినెస్ ట్రావెల్స్‌కి అనుమతివ్వొద్దని సీనియర్ మేనేజర్లకు పైనుంచి మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోషల్ ఫంక్షన్లు, టీమ్ ఆఫ్‌సైట్లు, ఇన్-పర్సన్ ఈవెంట్స్‌కి ఇకపై అప్రూవల్ ఇవ్వబోమంటూ గూగుల్ ఉన్నతాధికారులు ఎగ్జిక్యూటివ్‌లకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
Indane Gas Customers: ఇన్‌డేన్ గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు. నిన్న సాయంత్రానికే తొలిగిపోతాయన్న ఐఓసీ
Indane Gas Customers: ఇండేన్ గ్యాస్ బుకింగ్, డెలివరీ సేవల్లో రెండు రోజులుగా అంతరాయం ఏర్పడినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, బహుశా ఈ రోజు సాయంత్రానికి ఇబ్బందులు తొలిగిపోతాయని, దీంతో రేపటి నుంచి యథావిధిగా సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు నిన్న మంగళవారం పేర్కొంది. అయితే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మాత్రం చెప్పలేదు. -
‘Fine’ Apple: ‘యాపిల్’కి జరిమానా. ఏ మోడల్ ఫోన్లూ అమ్మొద్దంటూ ఆ దేశం నిర్మొహమాటంగా ఆదేశం
‘Fine’ Apple: ఛార్జర్ లేకుండా ఐఫోన్ అమ్మొద్దని బ్రెజిల్ ప్రభుత్వం యాపిల్ సంస్థను ఆదేశించింది. ఈ మేరకు అఫిషియల్ గెజిట్‌లో పేర్కొంది. ఫోన్‌కి ఛార్జర్ అవసరమని తెలిసినప్పటికీ ఆ సంస్థ ఉద్దేశపూర్వకంగానే వినియోగదారులపై వివక్ష చూపినట్లు తప్పుపట్టింది. ఈ తప్పు చేసినందుకు 2 పాయింట్ మూడు ఎనిమిది మిలియన్ డాలర్ల జరిమానా కూడా విధించింది. ఇక మీదట ఛార్జర్ లేకుండా ఏ ఐఫోన్ మోడల్‌నీ విక్రయించొద్దని తేల్చిచెప్పింది. -
American Express Credit Cards: అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డులపై నిషేధం ఎత్తివేత.
American Express Credit Cards: కొత్త క్రెడిట్ కార్డులను జారీచేయకుండా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్‌పై విధించిన నిషేధాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎత్తివేసింది. లోకల్ డేటా స్టోరేజ్ రూల్స్ పాటించట్లేదనే కారణంతో 2021 ఏప్రిల్‌లో నిషేధం విధించిన ఆర్బీఐ 15 నెలల అనంతరం నిన్న అనుమతించింది.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?