Energy Demand in India: ఈ దశాబ్దంలో ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఇండియాలోనే ఎనర్జీకి భారీగా డిమాండ్ పెరగనుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేసింది. లేటెస్టుగా విడుదల చేసిన వరల్డ్ ఎనర్జీ ఔట్‌లుక్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ నేపథ్యంలో భారతదేశంలో ఎనర్జీకి గిరాకీ ఏటా 3 శాతం పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలిపింది. 2025 నాటికి ఇండియా అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఎదగనుండటం మరో కారణమని పేర్కొంది.
Hyderabad to Thailand: హైదరాబాద్, థాయ్‌లాండ్ మధ్య ప్రయాణికులతోపాటు సరుకులకు సంబంధించిన విమాన సర్వీసులు కూడా రెండేళ్ల విరామం అనంతరం ఎల్లుండి నుంచి పున:ప్రారంభం కానున్నాయి. కొవిడ్ వల్ల నిలిచిపోయిన ఈ సేవలు మళ్లీ మొదలవుతుండటం ఔషధాల వంటి ముఖ్యమైన ప్రొడక్టుల రవాణాకు, పర్యాటకుల రాకపోకలకు ఉపయుక్తంగా ఉంటుందని థాయ్ కాన్సులేట్ జనరల్ నిటిరూగ్ ఫోన్ ప్రాసెర్ట్ హర్షం వ్యక్తం చేశారు.
India.. world's start-up capital: భారతదేశం ప్రపంచ స్టార్టప్‌ల రాజధానిగా ఎదుగుతోందని మైక్రోసాఫ్ట్ ఇండియా స్టార్టప్ ఎకోసిస్టమ్ డైరెక్టర్ సంగీత బవి అన్నారు. ఇండియాలో ఒక వ్యాపారవేత్తగా ఉండటానికి ఇది సరైన సమయమని చెప్పారు. భారతదేశం సాంస్కృతికపరంగా కూడా చాలా మార్పులకు లోనవుతోందని, ఎంట్రప్రెన్యూర్‌షిప్ వైపు శరవేగంగా దూసుకుపోతోందని తెలిపారు. సొంత స్టార్టప్‌లను బిల్డ్ చేయాలనుకునేవారికి మైక్రోసాఫ్ట్ ఏవిధంగా సాయపడుతోందో ఆమె వివరించారు.
Biggest Buyout in Asia: ఈ ఏడాది ఆసియాలోనే అతిపెద్ద కొనుగోలు నమోదు కానుంది. జపాన్‌కి చెందిన తోషిబా సంస్థను అదే దేశంలోని జేఐపీ గ్రూప్ కన్సార్షియం.. టేకోవర్ చేసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. మల్టీ నేషనల్ కంపెనీ అయిన తోషిబా మార్కెట్ విలువను 16 బిలియన్ డాలర్లకు (2.4 ట్రిలియన్ యెన్‌లకు) పైగా నిర్దారించినట్లు తెలుస్తోంది. బైఔట్ వార్తల నేపథ్యంలో తోషిబా షేర్ విలువ నిన్న సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 5 వేల 391 యెన్స్…
Hyderabad and other 6 cities: హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఏడు మేజర్ సిటీల్లో ఆఫీసు స్థలాల లీజింగ్ గత నెలలో 37 శాతం పెరిగిందని జేఎల్‌ఎల్ ఇండియా అనే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. సెప్టెంబర్ మొత్తమ్మీద 63 లక్షల స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని లీజ్‌కి ఇచ్చారని తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో ఇది 46 లక్షల చదరపు అడుగులు మాత్రమేనని వెల్లడించింది.
Steel Pricing: ఈ ఆర్థిక సంవత్సరంలో స్టీల్‌కి గిరాకీ 90 లక్షల టన్నులు పెరగనుందని, తద్వారా మొత్తం పదకొండున్నర కోట్ల టన్నులకు చేరనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఒక టన్ను ఉక్కు ధర 55 వేల నుంచి 57 వేల రూపాయల వరకు ఉంది. అంతర్జాతీయంగా స్టీల్ ఉత్పత్తి 6.2 కోట్ల టన్నులు తగ్గినప్పటికీ ఇండియాలో డిమాండ్ బాగుండటం ఈ సెక్టార్‌కి ప్లస్ పాయింట్‌గా మారిందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad Weapon Systems: రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి జాతీయ రాజకీయాల్లో ఎంత రచ్చ జరిగిందో దేశం మొత్తం చూసింది. ఈ అంశంపై అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పలుమార్లు నువ్వా నేనా అన్నంత స్థాయిలో తలపడ్డాయి. పార్లమెంట్ లోపల, బయట పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తమ్మీద ఈ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది. అయితే.. ఇప్పుడు ఆ రాఫెల్ యుద్ధ విమానాల్లో మేడిన్ హైదరాబాద్ అస్త్రాలను అమర్చనున్నారు.
World's First Licensing Deal: అధిక ధర కలిగిన క్యాన్సర్ మందు తయారీ కోసం నోవార్టిస్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి లైసెన్సింగ్ డీల్‌పై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా దీర్ఘకాలిక మైలోయిడ్ లుకేమియా ట్రీట్మెంట్‌లో వాడే ఓరల్ డ్రగ్ నిలోటినిబ్‌ను రూపొందించనున్నారు. ఈ ఔషధాన్ని ఈజిప్ట్, గ్వాటెమాల, ఇండోనేషియా, మొరాకో, పాకిస్థాన్, ది ఫిలిప్పీన్స్, ట్యునీషియా వంటి ఏడు మధ్య ఆదాయ దేశాల్లో జనరిక్ డ్రగ్‌మేకర్స్ తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నారు.
Shiv Nadar: ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ ఫౌండర్ శివ్ నాడార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సగటున రోజుకి 3 కోట్ల రూపాయలకు పైగా దానమిచ్చి మన దేశంలో అత్యధిక సంపదను పంచిపెట్టినవారి లిస్టులో టాప్‌లో నిలిచారు. ఏడాది కాలంలో ఏకంగా రూ.1,161 కోట్లు డొనేట్ చేశారు. తద్వారా తాజాగా విడుదలైన ‘‘ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్ట్-2022’’లో అగ్రస్థానాన్ని ఆక్రమించారు.