GST Returns: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్‌వర్క్ (జీఎస్‌టీఎన్) పోర్టల్ స్లోగా పనిచేయటంతో ట్యాక్స్ పేయర్లు సకాలంలో పన్నులను చెల్లించలేక ఇబ్బందిపడ్డారు. దీంతో సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీఎస్‌టీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) అధికారులు తెలిపారు. కొన్ని కేటగిరీల్లోని ట్యాక్స్ పేయర్లు GSTR 3B రిటర్న్స్‌ను సమర్పించేందుకు నిన్న గురువారమే చివరి తేదీ కావటం వల్ల గడువు లోపు సబ్మిట్ చేయనివాళ్ల కోసం CBIC ఆఫీసర్లు ఈ ప్రకటన చేశారు.
read also: Bangladesh: వెరైటీ దొంగ.. పోలీసులకే ఫోన్ చేశాడు..ఎందుకంటే..
GSTR-3Bని వివిధ రాష్ట్రాల్లోని పన్ను చెల్లింపుదారులు ప్రతి నెలా 20, 22 మరియు 24 తేదీల్లో ఫైల్ చేస్తుంటారు. నిన్న 20వ తేదీ కావటంతో కొన్ని ప్రాంతాల్లోని ట్యాక్స్ పేయర్లకు సమస్య ఎదురైందని, అలాంటివారిపై లేట్ ఫీజు లేదా వడ్డీ భారం పడకుండా ఉండేందుకు గడువు పొడిగించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ మేరకు జీఎస్‌టీ కౌన్సిల్‌తో చర్చిస్తున్నామని సీబీఐసీ అధికారులు వివరణ ఇచ్చారు. జీఎస్‌టీఎన్ నిర్వహణను ఇన్ఫోసిస్ చూస్తున్న సంగతి తెలిసిందే.
జీఎస్‌టీఎన్‌లో తలెత్తిన ఈ సాంకేతిక సమస్య.. ఫెస్టివ్ సీజన్‌తోపాటు వీకెండ్ మూడ్‌లో ఉండే ట్యాక్స్ పేయర్లకు, కార్పొరేట్ సంస్థలకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రాజత్ మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి జీఎస్‌టీ రిటర్న్స్ దాఖలు గడువును కనీసం ఒకటీ రెండు రోజులైనా పొడిగించకతప్పదని అన్నారు.