Hyderabad and other 6 cities: హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఏడు మేజర్ సిటీల్లో ఆఫీసు స్థలాల లీజింగ్ గత నెలలో 37 శాతం పెరిగిందని జేఎల్‌ఎల్ ఇండియా అనే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. సెప్టెంబర్ మొత్తమ్మీద 63 లక్షల స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని లీజ్‌కి ఇచ్చారని తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో ఇది 46 లక్షల చదరపు అడుగులు మాత్రమేనని వెల్లడించింది. బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థలే ఎక్కువ శాతం ఆఫీస్ స్పేస్‌ని లీజ్‌కి తీసుకున్నాయని, ఐటీ రంగం రెండో స్థానానికి పరిమితమైందని జేఎల్‌ఎల్ ఇండియా వివరించింది.
NRI Devotee World Tour: తిరుమలకు బైక్ పై ఆస్ట్రేలియా భక్తుడు
ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఎక్కువగా జరిగిన నగరాల్లో ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, పుణె టాప్-3లో ఉన్నాయి. అన్ని లీజింగ్ కార్యకలాపాల్లో నాలుగులో మూడో వంతు ఈ మూడు నగరాలదే కావటం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా ఉన్నాయి. గత నెల సెప్టెంబర్‌లో 4.6 మిలియన్ స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని లీజ్‌కి ఇవ్వగా అంతకుముందు నెల ఆగస్టులో 3.9 మిలియన్ స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని లీజుకి ఇచ్చారు. ఈ డేటాలో ప్రి-కమిట్మెంట్లు, టర్మ్ రెన్యువల్స్ కూడా ఉన్నాయి. చర్చల దశలో ఉన్న డీల్స్‌ని చేర్చకపోవటం గమనార్హం.
ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీలు పెరుగుతుండటంతో డిమాండ్ మరింత అధికమవుతోందని జేఎల్‌ఎల్ ఇండియా హెడ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ చీఫ్ ఎకనమిస్ట్ సమంతక్ దాస్ చెప్పారు. అయితే ఈ గిరాకీ.. ఈ ఏడాది చివరి నాటికి తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. గ్లోబల్ ఎకానమీలో నెలకొన్న పరిస్థితులే ఇందుకు కారణమని తెలిపారు. ఈ ఏడాది మార్చి త్రైమాసికం చివరి నాటికి ఇండియా ఆఫీస్ గ్రేడ్-ఏ(ప్రీమియం) స్టాక్ 732 మిలియన్ చదరపు అడుగులు. ఇతర గ్రేడ్ల ఆఫీస్ స్టాక్ 370 మిలియన్ చదరపు అడుగులు. టోటల్ స్టాక్ దాదాపు 1.1 బిలియన్ చదరపు అడుగులు.