Steel Pricing: ఈ ఆర్థిక సంవత్సరంలో స్టీల్‌కి గిరాకీ 90 లక్షల టన్నులు పెరగనుందని, తద్వారా మొత్తం పదకొండున్నర కోట్ల టన్నులకు చేరనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఒక టన్ను ఉక్కు ధర 55 వేల నుంచి 57 వేల రూపాయల వరకు ఉంది. అంతర్జాతీయంగా స్టీల్ ఉత్పత్తి 6.2 కోట్ల టన్నులు తగ్గినప్పటికీ ఇండియాలో డిమాండ్ బాగుండటం ఈ సెక్టార్‌కి ప్లస్ పాయింట్‌గా మారిందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశీయంగా ఇప్పటికే ఉక్కు ధర మ్యాగ్జిమమ్ లెవల్ నుంచి 40 శాతం తగ్గిందని, ఇంకా కిందికి వచ్చే అవకాశాలు లేవని చెబుతున్నారు. అంతర్జాతీయంగా స్టీల్ ధరల పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. యూరప్, అమెరికా, చైనా వంటి దేశాల్లో ఉక్కు ధరలు తగ్గుతున్నాయి. ఇండియాలో మాత్రమే ప్రొడక్షన్‌తోపాటు డిమాండ్ కూడా పెరుగుతుండటం చెప్పుకోదగ్గ విషయం. ఈ ఆర్థిక సంవత్సరంలోని రెండో అర్ధ వార్షికంలోనైనా పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు జేఎస్‌డబ్ల్యూ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ గ్రూప్ సీఎఫ్‌ఓ ఎంవీఎస్ శేషగిరిరావు తెలిపారు.
Venkatesh: ఓరి దేవుడా.. 15 నిమిషాలకే వెంకీ మామ అన్ని కోట్లు తీసుకున్నాడా..?
ఇనప ఖనిజం మరియు కోకింగ్ కోల్ ధరలు తగ్గుతుండకపోవటంతో స్టీల్ రేట్లు కూడా దిగొచ్చే అవకాశం లేదని అన్నారు. ‘‘ఇండియా విషయానికొస్తే మొదటి అర్ధ సంవత్సరం కన్నా రెండో అర్ధ సంవత్సరం ఎప్పుడూ బెటర్‌గానే ఉంటుంది. రుతుపవనాలు వెళ్లిపోయాక, పండగ సీజన్ అనంతరం ఉక్కుకి డిమాండ్ పెరుగుతుంది. నాలుగు త్రైమాసికాలతో పోల్చితే నాలుగోది బెస్ట్ అని చెప్పొచ్చు. క్యూ3 నుంచే గిరాకీ పెరగటం ప్రారంభమవుతుంది.