PM Modi : లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం పశ్చిమ బెంగాల్‌లోని మధురాపూర్‌కు చేరుకున్నారు.
విపక్ష ఇండియా కూటమి జూన్ 1వ తేదీన ఢిల్లీలో సమావేశం కాబోతుంది. ఈ మీటింగ్‌కు రావాల్సిందిగా కూటమిలోని అన్ని పార్టీలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇప్పటికే సమాచారం ఇచ్చారు.
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. ఝర్గ్రామ్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిపై రాళ్ల దాడి జరిగింది. ఆరో దశ పోలింగ్‌లో భాగంగా మిడ్నాపూర్ జిల్లాలోని గర్బెటాలోని మంగళపోత ప్రాంతాన్ని సందర్శిస్తున్న సమయంలో బీజేపీ నేత ప్రనత్ తుడుపై దాడి జరిగింది.
దేశ వ్యాప్తంగా శనివారం ఆరో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే పలు ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్లు ఉండడంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపిస్తుంది. మేదినీపూర్‌లో బీజేపీ నాయకుడు, నటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షో నిర్వహిస్తుండగా.. సీసాలు, రాళ్లు విసిరారు. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా.. బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌కు మద్దతుగా రోడ్‌షో చేసేందుకు మిథున్ అక్కడికి చేరుకున్నారు. మిథున్ రోడ్ షో మేదినీపూర్‌లోని కెరానిటాలా ప్రాంతానికి చేరుకోగానే తృణమూల్ కార్యకర్తలు రోడ్డు పక్కన బైఠాయించి నిరసన తెలిపారు. ఈ…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమితో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పన్స్కురాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న దీదీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు వస్తే.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే భారత కూటమికి పూర్తిగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
INDIA Bloc: ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి, ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమి పేరుతో ఏకమయ్యాయి. కూటమి పెట్టిన సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కూడా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ,
Amit Shah: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) రగులుతోంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం హోం మంత్రి అమిత్ షా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. అఘాయిత్యాలపై తప్పుడు ప్రకటనలు చేస్తూ రాష్ట్ర మహిళల ఆత్మగౌరవంతో ఆడుకోవద్దని మండిపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు, ప్రధాని మోడీపై సీఎం మమత విరుచుకుపడ్డారు. బొంగావ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో బిజెపి పాలిత రాష్ట్రాల మాదిరిగా లేదని ప్రధాని మోడీ గుర్తుంచుకోవాలని అన్నారు. అంతేకాకుండా.. ఇక్కడ మహిళల ఆత్మగౌరవంతో ఆడవద్దని, మా…
PM Modi: పశ్చిమ బెంగాల్లో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలపై విరుచుకుపడ్డారు. సందేశ్‌ఖాలీలో టీఎంసీ నాయకులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఇప్పుడు ఆ పార్టీ గుండాలు వారిని బెదిరిస్తున్నారని మోడీ ఆరోపించారు.