Trinamool MLA: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్రా ‘శ్రీరాముడు’ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘శ్రీరాముడు హిందువు కాదు, ముస్లిం’’ అని ఆయన చేసిన కామెంట్స్‌పై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. బీజేపీ నేత ప్రదీప్ భండారి ఎక్స్‌లో ఈ వ్యాఖ్యలకు చెందిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు.
Mamata Banerjee: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్తగా ‘‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవక మిషన్ గ్రామీణ్(VB-G RAM G)’’ చట్టం, 2025ను తీసుకురావడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహాత్మా గాంధీ పేరును ఉద్దేశపూర్వకంగా బీజేపీ తొలగిస్తోందని, గాంధీ అంటే బీజేపీకి పడదని ఆరోపిస్తున్నాయి.
Mamata Banerjee: కేంద్రం ఎన్నికల సంఘం ఓట్ల ప్రక్షాళన కోసం నిర్వహిస్తున్న ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా, బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఈ పరిణామం రుచించని విషయంగా ఉంది. ఎస్ఐఆర్ రాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలను బహిర్గతం చేసిందని, రాష్ట్రంలో ఆమె పాలన అంతం కాబోతోందని బీజేపీ పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకురాలు మమతా బెనర్జీ అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వేసిన ఓట్ల కారణంగానే అధికారంలో…
పార్లమెంట్‌లో ఈ-సిగరెట్ వివాదం ఇంకా కొనసాగుతోంది. గత వారం బీజేపీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ లోపల ఈ-సిగరెట్ తాగేందుకు అనుమతి ఉందా? అంటూ స్పీకర్ ఓం బిర్లాను ప్రశ్నించారు. అందుకు సమాధానంగా స్పీకర్ లేదని చెప్పారు.
లోక్‌సభలో ప్రస్తుతం ఈ-సిగరెట్ వివాదం నడుస్తోంది. గురువారం బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. పేరు ప్రస్తావించకుండా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఈ-సిగరెట్ తాగుతున్నారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాను అనురాగ్ ఠాకూర్ కోరారు.
Babri Masjid: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ముర్షిదాబాద్‌లో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంచలనంగా మారింది.
వచ్చే ఏడాది ప్రారంభంలోనే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ ఎన్నికల్లో మాదిరిగానే.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలను కూడా కమలనాథులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.
నేడు (డిసెంబర్ 1న) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈరోజు ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలకు, ఎన్నికలు జరగనున్న అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR) అంశంపై ప్రతిపక్ష నాయకులు తరచుగా అంతరాయం కలిగించారు. గందరగోళం కారణంగా, లోక్‌సభ రోజంతా స్తంభించిపోయింది. సమావేశానికి ముందు, ప్రధాని మోడీ ప్రతిపక్ష నాయకులను సహకరించాలని, ఉభయ సభలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీలతో ఏకాభిప్రాయం సాధించడానికి, సభ సజావుగా…
Parliament winter session: శీతాకాలంలో రాజకీయ వేడిని పుట్టించేలా రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో ఆదివారం ఆల్ పార్టీ మీట్ నిర్వహించారు. అయితే, ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం నిర్వహిస్తు్న్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చకు డిమాండ్ చేశాయి.