West Bengal: రణరంగంగా మారిన బెంగాల్లో ఎన్నికల ప్రచారం.. సీసాలు, రాళ్లతో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపిస్తుంది. మేదినీపూర్‌లో బీజేపీ నాయకుడు, నటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షో నిర్వహిస్తుండగా.. సీసాలు, రాళ్లు విసిరారు. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా.. బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌కు మద్దతుగా రోడ్‌షో చేసేందుకు మిథున్ అక్కడికి చేరుకున్నారు.
మిథున్ రోడ్ షో మేదినీపూర్‌లోని కెరానిటాలా ప్రాంతానికి చేరుకోగానే తృణమూల్ కార్యకర్తలు రోడ్డు పక్కన బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా.. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రోడ్ షో చేస్తుండగా టీఎంసీ కార్యకర్తలు తమపైకి సీసాలు, రాళ్లతో దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.
Bandi Sanjay: వారణాసిలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం.. తెలుగు సంఘాల ప్రతినిధులతో భేటి
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
మరోవైపు.. మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పంచషైర్‌లోని జాదవ్‌పూర్ స్థానం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థి సృజన్ భట్టాచార్య కారుపై రాళ్ల దాడి జరిగింది. అంతేకాకుండా.. ప్రచారం నిర్వహించే సమయంలో వారి పోస్టర్లు, ఫ్లెక్సీలు చింపేశారు. ఇదిలా ఉంటే.. తూర్పు మేదినీపూర్‌లోని భగవాన్‌పూర్‌లో సోమవారం రాత్రి టీఎంసి, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాగా.. ఈ ఘటనపై బీజేపీ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ ఘటనలో పోలీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.
KTM Mew Colour: బైక్ రంగులు మార్చిన కెటిఎమ్ ఇండియా.. కొత్త కలర్స్ లో అందుబాటులోకి..
సోమవారం ఖర్దాలోని నగరానికి ఆనుకుని ఉన్న డమ్‌డమ్ లోక్‌సభ స్థానం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థి, సీనియర్ నాయకుడు సుజన్ చక్రవర్తి ప్రచారంలో అడ్డంకులు సృష్టించారు. ఈ ఘటనపై సీపీఎం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రెండు ఘటనల్లోనూ టీఎంసీ కార్యకర్తలపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనల్లో పార్టీ కార్యకర్తల ప్రమేయాన్ని అధికార పార్టీ కొట్టిపారేసింది. ఇది స్థానిక ప్రజల నిరసన అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!