పశ్చిమ బెంగాల్ లో చివరిదశ ఎన్నికల్లో హింస చెలరేగింది. శనివారం నదియాలో బీజేపీ కార్యకర్త కాల్చి చంపారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే బీజేపీలో చేరిన హఫీజుల్ షేక్‌ను టీ స్టాల్ వద్ద ఓ వ్యక్తి కాల్చి చంపాడు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించగా.. పరారీలో అతని కోసం వెతుకుతున్నారు. మృతుడు షేక్ పై దాడి చేసిన వారిలో ఇద్దరు నిందితులను గుర్తించారు. వారిద్దరిపై క్రిమినల్ రికార్డులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Read Also: Telangana Rains: నేడు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు..
కాగా.. షేక్ తల నరికి చంపినట్లు వచ్చిన వార్తలను పోలీసులు ఖండించారు. గనత్ కాల్చి చంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. బీజేపీలో చేరినందుకే షేక్‌ను హత్య చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. తమ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం దాడికి పాల్పడ్డాయని బీజేపీ ఆరోపించింది. “పశ్చిమ బెంగాల్‌లో హత్యలు మొదలయ్యాయి. మరో బిజెపి కార్యకర్త హఫీజుల్ షేక్ హత్యకు గురయ్యాడు”. అని బిజెపి ఐటి సెల్ హెడ్ అమిత్ మాల్వియా అన్నారు ఎక్స్ లో తెలిపారు.
Read Also: Exit Poll 2024: ఎగ్జిట్ పోల్ పై ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నాడంటే ?
అయితే ఎన్నికల ముందు షేక్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలోని మైనారిటీలు బీజేపీలో చేరారని.. ఈ క్రమంలోనే హత్య ఘటనకు పాల్పడినట్లు మాల్వియా చెప్పారు. డైమండ్ హార్బర్‌లో కూడా ముస్లింలను టార్గెట్ చేశారని.. అక్కడ సీపీఐ(ఎం) అభ్యర్థి ప్రతికూర్ రెహ్మాన్‌కు పెద్ద సంఖ్యలో ఓటేశారని ఆయన తెలిపారు.