Mamata Banerjee: ‘‘కొన్నిసార్లు ప్రభుత్వాలు ఒక రోజు మాత్రమే ఉంటాయి.’’ దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే కూటమి గెలిచి, ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ వేడులకు ఢిల్లీ ముస్తాబైంది. అయితే, ప్రమాణస్వీకారానికి ఒక రోజు ముందు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఒక రోజు మాత్రమే ఉంటాయని అన్నారు. శనివారం తృణమూల్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామికంగా ఏర్పడుతున్న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కార్యక్రమానికి తమ పార్టీ హాజరుకాబోదని చెప్పారు.
‘‘400 సీట్ల గురించి మాట్లాడిన బీజేపీ, మెజారిటీ కూడా పొందలేకపోయిందని అన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటే ఏమీ జరగదని అనుకోకండీ, ఎందుకంటే పరిస్తితులు మారుతూనే ఉంటాయి, మేం చూస్తుంటాం, కొన్ని రోజుల తర్వాత కొత్త ఇండియా ప్రభుత్వం ఏర్పడుతుంది, కొన్ని రోజులు వారు అధికారంలో ఉండనివ్వండి. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఒక రోజు మాత్రమే ఉన్నాయి. ఏదైనా జరగొచ్చు, ఎవరికి తెలుసు ఈ ప్రభుత్వం 15 రోజులే ఉంటుందేమో..?’’ అని మమతా బెనర్జీ అన్నారు.
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
Read Also: Fadnavis: వ్యూహం మార్చిన ఫడ్నవీస్.. మహా ఎన్నికలే టార్గెట్!
బీజేపీ పౌరసత్వ సవరణ చట్టం (CAA)తో సహా కఠినమైన చట్టాలను రద్దు చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అప్రజాస్వామికంగా ఏర్పడుతున్న ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పలేమని, మళ్లీ వారు పార్టీలను చీల్చేందుకు ప్రయత్నిస్తారని, ప్రమాణస్వీకారానికి తమకు ఆహ్వానం అందలేదని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 42 ఎంపీ సీట్లలో బీజేపీ 12 సీట్లు గెలుచుకోగా.. టీఎంసీ 29 స్థానాలను కైవసం చేసుకుంది. 2019లో బీజేపీకి 18 రాగా, టీఎంసీకి 22 వచ్చాయి.
మొత్తంగా ఈ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి 293 స్థానాలను కైవసం చేసుకుంది. 2014, 2019లో రెండుసార్లు బీజేపీ స్వతహాగా మ్యాజిక్ ఫిగర్( 543 ఎంపీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 272) స్థానాలను గెలుచుకుంది. ఈ సారి మెజారిటీకి దాదాపుగా 30 సీట్లు తక్కువగా వచ్చాయి. మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన మద్దతుతో ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!