West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఆదివారం స్థానిక కాంగ్రెస్ నాయకుడి హత్య చోటు చేసుకుంది. ఉదయం తుపాకీ కాల్పులు, బాంబులు విసిరి కాంగ్రెస్ నాయకుడిని చంపినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన కాంగ్రెస్ నేతని షేక్ సైఫుద్దీన్‌గా గుర్తించారు. ఇతను మాణిక్‌చక్‌లోని గోపాల్ పూర్ ప్రాంతానికి చెందిన కీలక నేత.
Rape Attempt: అత్యాచారం ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని అరెస్టు చేశారు. నిందితుడు నారాయణ్ తన నివాసంలో బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. అతను తన బంకురా నివాసంలో మూడు రోజుల పాటు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలి కుటుంబీకులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాగా టీఎంసీ ఆయనను ట్రేడ్ యూనియన్ నుంచి సస్పెండ్ చేసింది. పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆర్‌జికర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌పై అత్యాచారం,…
పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై టీమిండియా మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ హర్భజన్ సింగ్ ప్రకటన వెలువడింది.
కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ కేసు అధికార పార్టీకి సవాల్ గా మారింది. సొంత పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సమయంలో జాతీయ స్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షించిన అనేక ఆసక్తికరమైన ఉదంతాలు చోటు చేసుకున్నాయి.
Mamata Banerjee: ఇటీవల బంగ్లాదేశ్ అల్లర్లను ఉద్దేశిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ తన నిరసనను దౌత్యమార్గాల ద్వారా తెలియజేసినట్లు విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం చెప్పింది.
తృణమూల్ కాంగ్రెస్ (TMC) కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) కౌన్సిలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె తన పార్టీకి చెందిన యువ నాయకుడిని కొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షం కావడంతోనే వివాదం నెలకొంది. ఈ క్లిప్‌ను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ప్రజలు దీనిని చాలా ఖండిస్తున్నారు. ఈ వీడియోలో.. వార్డు నంబర్ 18 మహిళా కౌన్సిలర్ సునంద సర్కార్, వార్డు టీఎంసీ యూత్ ప్రెసిడెంట్ కేదార్ దాస్‌ను…