దంచి కొట్టిన కోహ్లీ-క్రునాల్.. ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఢిల్లీకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకున్నారు. భువనేశ్వర్ కుమార్ (3/33), జోష్ హాజిల్‌వుడ్ (2/36) గట్టి బౌలింగ్‌ను ఎదుర్కొని ఢిల్లీ బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డారు. ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 41…
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. మే 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ.. ఈ సమయంలో స్వయంగా విచ్చేసే వీఐపీలకు మాత్రమే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.. మే 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శనాలు ఉదయం 6 గంటలకు ప్రారంభించబోతోంది టీటీడీ.. అయితే, సిఫార్సు లేఖలు తీసుకుని శ్రీవారి…
Tirupati Police: తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇవాళ ( ఏప్రిల్ 21న) కీలక సూచనలు చేశారు.
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఆటో వాలాల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. టైం స్లాట్ టోకెన్ తీయిస్తామంటూ రైల్వే స్టేషన్ వద్ద భక్తులకు ఎక్కించుకుని వేగంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమయం ముగిస్తే భక్తుల వద్ద తీసుకున్న డబ్బులు రిటన్ ఇవ్వాల్సి వస్తుందనే అలోచనతో ఓ ఆటో డ్రైవర్ ఒవర్ టేక్ చేసే సమయంలో ముందున్న జీపును డీకోట్టాడు. దీంతో ఆటోలొ ప్రయాణిస్తున్న 13 మంది భక్తులు గాయాలు…
Tirumala Rush: వేసవి సెలవులతో పాటు వివిధ పరీక్షల ఫలితాల వెల్లడి కావడం, పైగా వీకెండ్ రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, వీరికి శ్రీవారి దర్శనం చేసుకోవడానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది.
Tirumala: వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో కలియుగ వైకుంఠం కిక్కిరిసిపోయింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసి.. బెజవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లను కడిగిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు తిరుమలలో జరుగుతోన్న అపచారాలు, ఘోరాలకు ప్రాయశ్చిత్తంగా.. తిరుమల మెట్లను కూడా కడగాలని సూచించారు మాజీ మంత్రి ఆర్కే రోజా..
తిరుపతిలోని ఓ నర్సింగ్ కాలేజీలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది.. లీలామహల్ సర్కిల్ లో ఉన్న వర్మ కాలేజీ నర్సింగ్ హాస్టల్లోకి ప్రవేశించిన ప్రిన్సిపాల్.. అర్థరాత్రి విద్యార్థినుల గదిలోకి దూరాడట.. అయితే, అప్రమత్తమైన విద్యార్థినులు తమ గదిలోకి దూరిన ప్రిన్సిపాల్ వర్మను నిర్భందించారు..
ఎస్వీ గోశాల వివాదం టెంపుల్ సిటీలో పొలిటికల్ హీట్ పెంచింది... అసత్య ప్రచారం చేసిన వైఎస్ జగన్ రేపు ఉదయం ఎస్వీ గోశాలకు రావాలి.. వచ్చి అక్కడి పరిస్థితి నేరుగా చూడవచ్చు అంటూ తెలుగుదేశం పార్టీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సవాల్ విసిరింది... అయితే టీడీపీ సవాల్ కు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.. రేపు ఉదయం 10 గంటలకు గోశాలలో కలుద్దాం అంటూ ప్రకటన విడుదల చేశారు..
క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలను పరిశీలించిన ఆయన.. గోవుల ఆరోగ్య పరిస్థితులు, గోవులకు అందుతున్న దాణాపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. టిటిడి గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదు, గోవులకు కావాల్సినంత దాణా ఉందని వెల్లడించారు.. ప్రతినిత్యం గోవుల ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.. గోవులు పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు.