Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 5pm 06 06 2025

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Published Date :June 6, 2025 , 5:16 pm
By Gogikar Sai Krishna
  • వెంటనే.. విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయండి!
  • భారత్‌లో స్టార్‌లింక్‌కి గ్రీన్‌సిగ్నల్.. అంతరిక్షం నుంచి ఇంటర్నెట్‌ సేవలు..!
  • భార్యభర్తల దారుణ హత్య.. ఫిజియోథెరపీ చేయడానికి వచ్చి..!
  • చినాబ్ బ్రిడ్జి.. ఐక్యత.. సంకల్పానికి చిహ్నం
Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం.. అన్నీ కేబినెట్‌ నిర్ణయం మేరకే!

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ కమిషన్ ముందు బహిరంగ విచారణకు హాజరయ్యారు. ఉదయం శామీర్‌పేట నివాసం నుంచి బీఆర్‌కే భవన్‌కు చేరుకున్న ఈటలను ఓపెన్‌ కోర్టులో కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది. 20 నిమిషాల పాటు బహిరంగ విచారణలో అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం చేశారు. కమిషన్‌ ముందు 113వ సాక్షిగా ఈటల హాజరు కాగా.. బ్యారేజీ నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్‌, డీపీఆర్‌లపైనే కమిషన్‌ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

Also Read

  • Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
  • Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
  • Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
  • AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..

బాధ్యత ఉండక్కర్లా.. ఏంటీ ఈ చిల్లర వేషాలు!

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన టైటిల్ పోరులో ఆర్సీబీ సంచలన విజయం సాధించి మొదటిసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ సాధించిన విజయాన్ని తమ విజయంగా భావించారు. బాణాసంచా కాలుస్తూ సంబరాల్లో మునిగితేలారు.

చినాబ్ బ్రిడ్జి.. ఐక్యత.. సంకల్పానికి చిహ్నం

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు అనుసంధానం ఇన్నాళ్లకు వాస్తవ రూపం దాల్చిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రపంచంలో ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఇన్నాళ్లకు కాశ్మీర్ ప్రజల కల నెరవేరిందని.. ఇది ఐక్యత, సంకల్పానికి చిహ్నంగా మోడీ అభివర్ణించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టు పూర్తి కావడం పట్ల ప్రశంసలు కురిపించారు, ఇది భారతదేశ మౌలిక సదుపాయాల ప్రయాణంలో ఒక మైలురాయిగా కొనియాడారు. అంతేకాకుండా జాతీయ ఐక్యతకు చిహ్నంగా అభివర్ణించారు. నేటి కార్యక్రమం భారతదేశ ఐక్యత మరియు సంకల్ప శక్తికి ఒక గొప్ప వేడుక అని మోడీ ప్రకటించారు. మాతా వైష్ణో దేవి ఆశీస్సులతో కాశ్మీర్ ఇప్పుడు భారతదేశపు విస్తారమైన రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించబడిందన్నారు.

వెంటనే.. విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయండి!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం (జూన్ 4) నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవాల సందర్భంగా మైదానం వెలుపల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. పెద్దఎత్తున అభిమానులు స్టేడియం వద్దకు చేరుకోవడం, అదే సమయంలో వర్షం పడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన యావత్‌ దేశంను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనపై ప్రతి ఒక్కరు సంతాపం వ్యక్తం చేశారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా.. కాశ్మీర్‌ అభివృద్ధిని ఆపలేరు..

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తొలిసారి కాశ్మీర్‌ లోయలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చినాబ్ వంతెన ప్రారంభోత్సవం జమ్మూ కాశ్మీర్‌ పురోగతికి ప్రతిబింబమని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. కాశ్మీర్‌లో అభివృద్ధిని ఆపలేరని పేర్కొన్నారు. పహల్గాం దాడి, ఆపరేషన్‌ సింధూర్‌ గురించి ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పామని పేర్కొన్నారు. పాకిస్తాన్ పర్యాటకానికి, మానవత్వానికి వ్యతిరేకం.. మన టూరిజాన్ని దెబ్బ తీసి పేదల పొట్ట గొట్టాలని ప్రయత్నిస్తుంది.. ఆదిల్‌ హుస్సేన్‌ గుర్రం మీద పర్యాటకులను తీసుకెళ్లే పోనీ వాలా.. తన కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడేవాడు.. ఆ రోజు టెర్రరిస్టులతో వీరోచితంగా పోరాడాడు.. కానీ, చివరకు అతడ్ని కూడా ఉగ్రవాదులు చంపేశారని ప్రధాని మోడీ మండిపడ్డారు.

ఇక ప‌ట్టణాల్లోనూ ఇందిర‌మ్మ ఇండ్లు

తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల పట్ల ప్రత్యేక దృష్టితో పథకాలు అమలవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, పేదలు నివసించే ప్రాంతాల్లో జీవనోపాధికి ఆటంకం లేకుండా జీ+3 మోడల్‌లో ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఆదివాసీలకు నివాస హక్కు కల్పించడమే కాకుండా, వారు జీవించేందుకు అవసరమైన వనరులను అందుబాటులో ఉంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ప‌ట్టణాల్లోనూ ఇందిర‌మ్మ ఇండ్లు పథకం కార్యరూపం దాల్చనుంది.

భార్యభర్తల దారుణ హత్య.. ఫిజియోథెరపీ చేయడానికి వచ్చి..!

హైదరాబాద్ నగరాన్ని కలకలం రేపేలా ఓ దారుణ హత్య జరిగిన సంఘటన రాజేంద్రనగర్‌లో వెలుగుచూసింది. వృద్ధ దంపతులైన షేక్ అబ్దుల్లా , ఆయన భార్య రిజ్వానాలను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.వృద్ధ దంపతులు తమ నివాసంలో బెడ్‌రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.

తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు కలకలం..

తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు కలకలం సృష్టిస్తున్నాయి. స్థానిక ఇంద్ర ప్రియదర్శిని కూరగాయలు మార్కెట్లో మత్తు ఎక్కించే ఇంజక్షన్లు వీడియో వైరల్ అవుతోంది. ఇంజక్షన్ లను తీసుకునే సమయంలో యువకులు వీడియో తీశారు. కూరగాయల మార్కెట్ లో తరచూ మత్తులో ఉంటూ యువకులు హల్ చల్ సృష్టిస్తున్నారు. తిరుపతి నగరంలో విచ్చలవిడిగా మత్తు పదార్థాల వినియోగం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. యువత స్వయంగా మత్తు ఇంజక్షన్లు వేసుకుంటున్నారని వెల్లడిస్తున్నారు.

ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహా శక్తిగా ఖైరతాబాద్ గణేషుడు.. ఎన్ని అడుగులంటే..?

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఈ ఏడాది శంకుస్థాపనగా కర్ర పూజ ఘనంగా నిర్వహించారు. నిర్జల ఏకాదశి రోజున జరిగే ఈ సంప్రదాయ కార్యక్రమంతో ఖైరతాబాద్ మహాగణపతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమాన్ని శ్రీగణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కర్ర పూజ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. రెండు ఉత్సవ కమిటీల అధ్యక్షుడిగా దానం నాగేందర్ నేతృత్వంలో కర్ర పూజ జయప్రదంగా ముగిసింది.

భారత్‌లో స్టార్‌లింక్‌కి గ్రీన్‌సిగ్నల్.. అంతరిక్షం నుంచి ఇంటర్నెట్‌ సేవలు..!

భారత్‌ మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ ఓ విభాగమైన స్టార్‌లింక్‌కు దేశంలో ఇంటర్నెట్ సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం లైసెన్స్‌ను మంజూరు చేసింది. దీంతో భారత్‌లో కార్యాచరణ ప్రారంభించనున్న మూడో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ ప్రొవైడర్‌గా స్టార్‌లింక్ నిలవనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర టెలికం శాఖ (DoT) స్టార్‌లింక్‌కు పాన్-ఇండియా లైసెన్స్ జారీ చేసింది. ఇప్పటికే భారత్‌లో భారతి గ్రూప్‌కు చెందిన “OneWeb”, జియోతో కలిసి పనిచేస్తున్న “Eutelsat” సంస్థలు ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీటిలో స్టార్‌లింక్ చేరడం ద్వారా ఈ రంగంలో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CV Anand
  • double murder
  • Elon Musk
  • Khairatabad Ganesh
  • Narendra Modi

తాజావార్తలు

  • Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..

  • Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..

  • Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..

  • Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..

  • Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions