చెవిరెడ్డి ఒక అపరిచితుడని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై జరిగిన దాడి, చెవిరెడ్డి కామెంట్స్ పై మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమ్మెటతో కొట్టడం వల్ల నా తల, భుజం పై గాయాలు అయ్యాయన్నారు.
తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంగరవారి పల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హస్పటల్ కు తరలించారు.
తనపై దాడి విషయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని డ్రామా చేశారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."నామినేషన్ రోజు నాపై దాడి చేశారు. మహిళా యూనివర్సిటీ వద్ద నాని కారుపై దాడి చేశారే తప్ప, ఆయనపై దాడి చేయలేదు.
సమస్యాత్మక వార్డుల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి డీఎస్పీ మనోహరాచ్చారి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రౌడీ షీటర్స్ పై నిఘా పెంచామని చెప్పారు. టపాసులు అమ్మడం, కొనడం నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అపర భక్తురాలైన తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు మే 22వ తేదీన తిరుమలలో వైభవంగా జరగనున్నాయి. సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యాణవనంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్టుకు కుటుంబసమేతంగా చేరుకున్నారు.
CM Revanth Reddy: నేడు మధ్యాహ్నం హైదరాబాద్ లోని బషీర్బాగ్లో పరిశ్రమల భవన్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పరిశ్రమలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
గోవింద నామ స్మరణతో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం మార్మోగింది. గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్వవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గరుడసేవ ఘనంగా నిర్వహించారు.
తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఏఎస్డీ లిస్ట్ లో ఉన్న 54 వేల మంది ఓటర్ లిస్ట్ లో 4 వేల మంది మాత్రమే ఓటు వేశారు అని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.