Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో భారీ ఎత్తున ఉద్యోగుల పదవీ విరమణ చేస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 113 మంది ఉద్యోగుల పదవీ విరమణ చేశారు. ఇద్దరు డిప్యూటి ఈఓ స్థాయి ఉద్యోగులుతో పాటు అటెండర్ స్థాయి ఉద్యోగుల వరకు పదవీ విరమణ చేశారు.
తిరుపతి మరియు చంద్రగిరి ప్రాంతాల్లో గంజాయి ఉపయోగాన్ని పూర్తిగా నిర్మూలించడానికి పోలీసులు కార్యకలాపాలు జరుపుతున్నారు . కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుతం గంజాయి వినియోగం పై ఉక్కుపాదం మోపడంతో జిల్లాలో 49 ప్రాంతాలను గంజాయి విక్రయాల హాట్స్పాట్లా గుర్తించి, పోలీసు వ్యవస్థ 100 రోజుల్లో గంజాయి ఉపయోగాన్ని పూర్తిగా అడ్డుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తున్నారు . ప్రతి పోలీసు స్టేషన్ల పరిధిలో యూత్ మరియు విద్యార్థులు గంజాయి ఉపయోగానికి దూరంగా ఉండటానికి ప్రత్యేక టీమ్లు ఏర్పాటు…
ఎవరైనా బయట భోజనం చేయాలంటే ఈ రోజుల్లో కాస్త ఆలోచించాల్సి వస్తోంది. ఎందుకంటే బిర్యానీలో బొద్దింక, ఐస్క్రీమ్లో జెర్రీ.. ఇలాంటి వార్తలు ఈ మధ్య సర్వసాధారణమైపోయాయి. తాజాగా తిరుపతిలోని ఓ హోటల్లో తినే భోజనంలో జెర్రీ ప్రత్యక్షమైంది.
తిరుపతిలోని రుయా ఆస్పత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చివేశారని ఆయన విమర్శించారు. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని, నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ జేఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం టోకెన్ లేని భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుపతి ఎంపీ సీటుపై బీజేపీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచినా.. ఎంపీ సీటు ఓడిపోవడానికి గల కారణాలపై అన్వేషణ మొదలుపెట్టారు పార్టీ నేతలు.. దీనికి ప్రధాన కారణం.. కూటమి నుండి క్రాస్ ఓటింగ్ జరగడమే అనే నిర్ధారణకు వచ్చారట.
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరగింది. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వెళ్లిన వారికి దర్శనం చేసుకునేందుకు టైం పడుతుందని టీటీడీ తెలిపింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెల్లడించింది.
Tirumala Special Days In June Month: ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ బాగానే కొనసాగుతూ ఉంది. గడిచిన కొద్దిరోజులుగా తిరుమలకు భక్తుల రాక ఎక్కువగా ఉండటంతో అక్కడ రోజురోజుకూ పరిస్థితి మారిపోతోంది. ముఖ్యంగా వేసవి సెలవులు ఉండటంతో దేశ నలుమూల నుంచి వెంకన్న స్వామిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక మే నెల ముగిమూపు కావడంతో త్వరలోనే పిల్లలకు బడులు తెరుచుకోనున్నాయి. కాబట్టి చాలామంది తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. జూన్ 30వ…