Tirumala: తిరుమలలో సప్తగిరులు భక్తజనంతో నిండిపోయాయి. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. దీంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టోకెన్ కలిగిన భక్తులు మాత్రం స్వామివారి 3 గంటల్లోనే దర్శించుకుంటున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండడం, వీకెండ్ కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. పరీక్షా ఫలితాలు కూడా వచ్చిన నేపథ్యంలో తిరుమలలో రద్దీ భారీగా పెరిగదింది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాలలో సర్వదర్శనానికి 30 నుంచి 41గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Rain Alert : కేదార్‌నాథ్, యమునోత్రి, చార్ ధామ్ లో భారీ వర్షం.. భక్తులకు హెచ్చరిక
తిరుమలలో భారీగా పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు దర్శనాలు రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు సులువుగా దర్శనాలు కల్పించేందుకు జూన్ 30 వరకు శుక్ర, శని, ఆదివారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ తాజాగా ప్రకటించింది. బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలు కూడా అనుమతించబోమని టీటీడీ తెలిపింది. ఈ మార్పును గమనించి భక్తులు టీటీడీకి సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు.