Tirumala Special Days In June Month: ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ బాగానే కొనసాగుతూ ఉంది. గడిచిన కొద్దిరోజులుగా తిరుమలకు భక్తుల రాక ఎక్కువగా ఉండటంతో అక్కడ రోజురోజుకూ పరిస్థితి మారిపోతోంది. ముఖ్యంగా వేసవి సెలవులు ఉండటంతో దేశ నలుమూల నుంచి వెంకన్న స్వామిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక మే నెల ముగిమూపు కావడంతో త్వరలోనే పిల్లలకు బడులు తెరుచుకోనున్నాయి. కాబట్టి చాలామంది తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు.
జూన్ 30వ తేదీ వరకు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా శుక్ర, శని, ఆదివారం తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇక నిర్ణయించిన ఈ సమయంలో ఎలాంటి సిఫార్సుల లేఖలు కూడా స్వీకరించబడవని టీటీడీ ఇదివరకే స్పష్టం చేసింది. ఇకపోతే 2024 జూన్ మాసంలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన చేసింది. ఇక వాటి వివరాలను చూస్తే..
జూన్ – 2024లో తిరుమలలో ప్రత్యేక రోజులు..
** జూన్ 1 – 5 : ఆకాశ గంగ అంజనాద్రి-బాలాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు.
** జూన్ 2 : మహి జయంతి.
** జూన్ 19 – 21 : వార్షిక అభిధ్యేయక లేదా జ్యేష్ఠాభిషేకం.
** జూన్ 20 : శ్రీ నాధముని వర్ష తిరు నక్షత్రోత్సవం.
** జూన్ 22 : పౌర్ణమి గరుడ సేవ.