కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి దాడితో రైతు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అధికారులకు మొర పెట్టుకోవడంతో పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కాకినాడ జిల్లాలో పులి సంచారం జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రత్తిపాడు (మం) పోతులూరు, కొడవలి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంపై ఎంపీ వంగా గీత స్పందించారు. పులిని బంధించే వరకు రైతులు పొలాల వైపు వెళ్లొద్దని ఎంపీ సూచించారు. 10 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె ప్రకటించారు. పులిబారినపడి చనిపోయిన పశువుల రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు ఎంపీ గీత. మరోవైపు ప్రత్తిపాడు వద్ద పులి…
ఏపీలో ఒకవైపు ఏనుగులు, మరోవైపు పులులు సంచారంతో జనం హడలిపోతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పులి సంచారం జనం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సీసీ కెమెరాలో పులి కదలికలను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సీసీ కెమెరాలు అమర్చి పులి జాడను గుర్తించారు అధికారులు. పులిని పట్టుకునేందుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులిని పట్టుకునే పనిలో 120 మంది అటవీ సిబ్బందిని వినియోగిస్తున్నారు. గత పది రోజులుగా ఒమ్మంగి, పోతులూరు, శరభవరం…
అడవుల్లో వుండాల్సిన చిరుతపులులు జనావాసాల్లోకి, పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో పంట పొలాల్లోకి వెళ్ళాలంటేనే రైతులు భయంతో బిక్కు బిక్కుమంటున్నారు..రోజుఎక్కడో ఒకచోట చిరుతల సంచారం కలకలం రేపుతోంది..ఒక్కరోజు మూడు చిరుతలు రైతుల కంటపడడం కేకలు పెడితే అవి అడవిలోకి పారిపోయాయి.. మరుసటిరోజు మరోచోట లేగదూడను చంపేశాయి చిరుతలు. నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం పెరిగిందా? లేక వలస వచ్చిన చిరుతలే సంచరిస్తున్నాయా అనేది అంతుచిక్కడం లేదంటున్నారు స్థానికులు. నిర్మల్ జిల్లాలో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతలు రైతులను…
కర్ణాటకలోని బన్నేర్‌ఘట్ నేషనల్ పార్క్‌లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. మైసూరులోని తప్పేకాడ వద్ద చిరుతపులుల ఎన్‌క్లోజర్ గుండా జైలో ప్రత్యేక వాహనంలో సందర్శకులు ప్రయాణం చేస్తుండగా, రోడ్డుపై పులుల గుంపు కనిపించింది. వెంటనే కారును దారి పక్కన పార్క్ చేశారు. పులులను వీడియో తీస్తున్నారు. ఈలోగా వెనుక నుంచి ఓ పులి వచ్చి జైలో కారును తన పళ్లతో గట్టిగా పట్టుకొని వెనక్కిలాగే ప్రయత్నం చేసింది. వెనక్కి లాగేందుకు చాలాసేపు ప్రయత్నం చేసింది. ఒకనోక దశలో ఆ…
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అటవీ గ్రామాలలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. కొయ్యూరు అటవీ ప్రాంతం నుండి మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామ పరిధిలో గల అటవీ ప్రాంతానికి పులి వచ్చినట్లు వారు తెలిపారు.అడవి సోమనపల్లి, వెంకటపూర్, అరేంద, ఖానాపూర్, కాన్సాయి పేట గ్రామస్తులు, ఎడ్ల, గొర్ల, బర్ల కాపరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ గ్రామ…
తిరుమలలో కొండ చరియలు విరిగిపడడం వల్ల స్వామివారిని దర్శనం చేసుకోలేని భక్తులకు మరో అవకాశం కల్పించింది టీటీడీ. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు అదనపు ఇఓ ధర్మారెడ్డి. భక్తులకు భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని ఆయన చెప్పారు. నవంబర్ 18 నుంచి డిసెంబరు 10వ తేది వరకు దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయా తేదీల్లో దర్శనం టికెట్లు వున్న భక్తులు రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.…
కర్నూలు జిల్లా శ్రీశైలం ముఖద్వారం సమీపంలో పెద్దపులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రోడ్డు దాటుతూ ప్రయాణికులకు పెద్ద పులి కనిపించింది. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. వాహనాలు నిలిపివేసి ఫోటోలు, వీడియోలు తీసిన ప్రయాణికులు. ఎన్టీవీ చేతిలో వీడియోలు వున్నాయి. పెద్ద పులి ఎటు నుంచి ఎటు వెళ్ళిందోనని టెన్షన్ పడుతున్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.