ఎంత చనువుగా మెదిలినా పులి పిల్లి అవ్వదుగా. చనువిచ్చింది కదా అని అతి చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఫారిన్ లో కొన్ని జూపార్క్ లలో పులులతో ఫొటోలు తీసుకుంటుంటారు. సరదాగా వాటి పక్కన నడుస్తుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పైత్యం మరింత ముదిరింది. రీల్స్ కోసం ఏకగాం పెద్ద పులితోనే పరాచికాలు ఆడుతున్నారు. ఇలాగే ఓ యువకుడు పెద్దపులితో రీల్స్ చేస్తూ దాడికి గురయ్యాడు. ఈ ఘటన థాయిలాండ్ లో చోటుచేసుకుంది.…
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూరుపల్లి అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మహదేవ పూర్ రేంజ్ పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. పలుచోట్ల పెద్దపులి అడుగులు కనిపించడంతో ప్రజలు భయాందోళనల వ్యక్తం చేస్తున్నారు. నస్తూరుపల్లి గ్రామానికి చెందిన వెంకటి అనే వ్యక్తి తన పశువుల కోసం అడవిలోకి వెళ్లి వస్తుండగా.. మహదేవపూర్ దిశగా వెళ్తున్న పెద్దపులి కనిపించిందని స్థానికులు అంటున్నారు. మహదేవపూర్ పరిసరాల్లో పెద్దపులి కనిపించిందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం…
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు.. కొన్ని సార్లు ఓ అసత్యం కూడా.. సత్యంగా ప్రచారంలోకి వస్తుంది.. అలాంటి పరిస్థిత ఏలూరు జిల్లాలో వచ్చింది.. పిల్లి పిల్లలను చూసి.. అవి పులి పిల్లలు అని భావించిన స్థానికికులు భయాందోళనకు గురయ్యారు.. ఆ తర్వాత నిజం తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అడవులు అంతరించిపోతుండడంతో వన్య మృగాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. జనావాసాల్లో తిరుగుతూ మనుషులపై దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. పశువులను పీక్కుతింటున్నాయి. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ పనుల కోసం వెళ్లిన వ్యక్తిపై పులి దాడి చేసి ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. జనావాసాల్లో పులుల సంచారంతో జనం ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో పులి ఓ మహిళపై దాడి చేసి చంపేసింది. కాఫీ తోటలో పనిచేస్తున్న రాధా అనే…
గన్నవరం పరిసర ప్రాంతాల్లో మరోసారి పులి సంచారం కలకలం రేపుతుంది. పులి కదలికలపై స్థానికుల్లో భయాందోళనలు నెలకున్నాయి. ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్తున్న సమయంలో పులి రోడ్డు దాటడం చూసినట్టు ఆర్టీసీ కండక్టర్ రవి కిరణ్ చెబుతున్నాడు. ఆగిరిపల్లి మండలం కళ్ళుటూరు గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ బొకినల రవి కిరణ్ ఉదయం డ్యూటీకి వెళ్తుండగా పులిని చూశాడు.
ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మంగపేట మండలం చుంచపెల్లి వద్ద గోదావరి నది దాటి వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పులి అడుగులు గుర్తించారు. పులి పాద ముద్రలు అనుసరించి మల్లూరు లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం వైపు వెళ్లి ఉంటుందని అంచనాకి వచ్చారు. చుంచుపల్లి, పాలయిగూడెం, ఓడగుడెం, మల్లూరు, నిలాధ్రిపేట, బాలన్నగూడెం పరిసర ప్రాంతాల ప్రజలను మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అప్రమత్తం చేశారు. పులి…
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను పులి వణికిస్తుంది. సిర్పూర్ టి మండలం ఇటిక్యాల పహాడ్ శివారులో పులి సంచారం కలకలం రేపుతోంది. నిన్న లేగ దూడను చంపి ఎద్దుపై దాడి చేసింది.. పులి దాడిలో ఎద్దుకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో.. కెనాల్ ఏరియాలో పులి పాద ముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి మానిటరింగ్ కోసం 10 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు.
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది రోజులుగా రెండు పులుల హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం మగపులి జానీ మహారాష్ట్ర కు వెళ్లిపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
జాతీయ రహదారిపై పులి కనిపించింది. నేరడిగొండ మండలం నిర్మల్ ఘాట్ సెక్షన్ పైన రోడ్డు దాటింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల గుండా రోడ్డు దాటింది. రోడ్డు పై దర్జాగా వెళ్తున్న పులిని చూసిన వాహనదారులు.. హడలెత్తిపోయారు. కారు, లారీ లో ప్రయాణిస్తున్న డ్రైవర్లుసెల్ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.