ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పులుల దాడులు కలకలం రేపుతున్నాయి. ఇన్నాళ్లు వరుసబెట్టి పశువులను చంపేశాయి.. తాజాగా కొమురం భీం జిల్లా వాంకిడి మండలం చౌపన్గూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఖానాపూర్ కుచెందిన సిడాం భీము పత్తిచేనులో ఉండగా పులి దాడి చేసి చంపేసింది. దాడి చేయడమే కాకుండా కొంత దూరం లాక్కెళ్లింది.. తీవ్ర రక్తస్రావం కావడంతో భీము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదే శివారులో పోడు సర్వే చేస్తున్న అటవీశాఖ అధికారులు సమాచారం చేరడంతో చప్పుళ్లు చేస్తూ స్పాట్ కు చేరుకున్నారు. అప్పటికే పులి మనిషి లోయలో పడేసి పారిపోయిందని క్షేత్రస్థాయి సిబ్బంది చెప్పారు.. అయితే పులి దాడి చేసిందా.. చిరుత పులా అనేది జిల్లా ఉన్నతాధికారులు తేల్చలేదు.. పాదముద్రలు సైతం గుర్తించారు అధికారులు. స్థానికులు కళ్లారా పులిని చూశామంటున్నారు. పులిని చూడ్డంతోపాటు మనిషి ప్రాణాలు కోల్పోవడం అటవీ ప్రాంత గ్రామాల్లో పులి పేరు చెబితేనే జడుసుకుంటున్నారు..
Read Also: Polavaram Project: పోలవరం ప్రాజెక్టు.. త్వరలో ముఖ్యమంత్రులతో సమావేశం..!
వారం రోజులుగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్, జైనాథ్ మండలాల్లోని పలు గ్రామాల శివార్లలో ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు పులులు సంచారం వీడియోల రూపంలో వెలుగులోకి వచ్చింది.. అలా పులులు రోడ్డెక్కాయో లేదో మరుసటి రోజే గుంజాల అటవీప్రాంతంలో ఓ ఆవుదూడను చంపేసింది.. దాని తర్వాత పిప్పల్ కోటీ శివారులో లేగ దూడ పై దాడి చేసింది పులి.. అయితే అది గాయాలతో ఇంటికి చేరింది..ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కొమురం భీం జిల్లాలో పులి దాడిలో భీము అనే రైతు ప్రాణాలు కోల్పోవడం ఉమ్మడి జిల్లా జనంలో వణుకుపుట్టిస్తోంది. 2020 నవంబర్ లో దిగిడలో విష్నేష్ అనే యువకుడి చంపేసిన పులి ఆతర్వాత కొద్ది రోజులకే పెంచికల్ పేట మండలం కొండపల్లిలో పసుల నిర్మల అనే బాలికను చంపేసింది. ఈరెండు మరణాలు జరిగిన సరిగ్గా రెండేళ్లకు అదే నవంబర్ నెలలో ఇప్పుడు మరో వ్యక్తి పులికి బలి కావడం విషాదాన్ని నింపింది.
అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న చేనులో పత్తి ఏరుతుండగా పులి దాడి చేసి 50 మీటర్ల రకు లాక్కెల్లిందని స్థానికులు చెప్పుతున్నారు.. అంతకంటే ముందే గోందిగూడ లో ఆపులి ఓదూడపైన దాడి చేసింది కాకపోతే అది తప్పించకపోయింది. అంతేకాదు పశువుల కాపర్లు కేకలు పెట్టడం బెదిరించడంతో పరుగులు పెట్టిన పులి గుట్టపైకెక్కి అక్కడ పత్తి ఏరే సిడాం భీము పై దాడి చేసిందంటున్నారు ప్రత్యేక్ష సాక్షలు. పులి దాడి చేసి చంపిందంటే అటవీశాఖ అధికారులు మాత్రం ఇంకా పులా,చిరుతనా అనేదానిపై క్లారిటి తెచ్చుకుంటున్నామంటున్నారు. దాడి జరిగిన మరుసటిరోజే నార్లపూర్ ,భీంపూర్ దారిలో పాదముద్రలు గుర్తించారు. అంతేకాకుండా దాడి జరిగిన ప్రదేశంలో పాదముద్రలు లభించాయి. అలాగే వెంట్రుకలు సైతం సేకరించారు. అయితే, దాన్ని టెస్ట్ నిమిత్తం హైదరాబాద్ కు పంపామని అది పులినా చిరుతపులినా అనేది క్లారిటి రావాల్సి ఉందంటున్నారు డీఎప్‌వో. దాడి చేసింది మ్యాన్ ఈటర్ కాదంటున్నారు అధికారులు.