పులి పంజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుందంటే దానిని వెంటాడి వేటాడే వరకు వదలదు. అడవుల్లో ఆహారం లేక పులులు నిత్యం గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పశువులపై దాడి చేయాలని భావించిన పులికి ఎదురు దెబ్బ తగిలింది.
హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని దుండిగల్ మున్సిపాలిటీ సమీపంలోని బౌరంపేట ఔటర్ రింగు రోడ్డు వద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. రెండున్నర నిమిషాల పాటుగా వీడియోలో పులి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పులిని చంపి దాని చర్మాన్ని విక్రయించేందుకు యత్నించిన ఆరుగురు వ్యక్తుల అంతర్ రాష్ట్ర ముఠాను మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పట్టుకున్నారు. వారి నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరిస్తున్న పులి తాజాగా బెజ్జూరు మండలం కుకుడ గ్రామంలో ఎద్దుపై దాడి చేసింది. దీంతో ఎద్దు తీవ్రంగా గాయపడింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్లో పెద్దపులి కలకలం సృష్టించింది. ఆపట్టణంలోని వినయ్ గార్డెన్ వద్ద రోడ్డు దాటుతుండగా పులిని ప్రయాణికులు చూసి భయాందోళనలకు గురయ్యారు.