ఏపీలో ఒకవైపు ఏనుగులు, మరోవైపు పులులు సంచారంతో జనం హడలిపోతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పులి సంచారం జనం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సీసీ కెమెరాలో పులి కదలికలను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సీసీ కెమెరాలు అమర్చి పులి జాడను గుర్తించారు అధికారులు. పులిని పట్టుకునేందుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
పులిని పట్టుకునే పనిలో 120 మంది అటవీ సిబ్బందిని వినియోగిస్తున్నారు. గత పది రోజులుగా ఒమ్మంగి, పోతులూరు, శరభవరం గ్రామాల్లో పశువులపై దాడి చేసింది పులి. ఆరు గేదెల్ని చంపేసింది పులి. వింత జంతువు దాడి చేస్తోందని హడలి పోయారు స్థానికులు. చీఫ్ అటవీ అధికారి శరవణన్ ఆధ్వర్యంలో అటవీ అధికారుల పర్యవేక్షణ చేస్తున్నారు. పులి తిరుగుతోందని తెలియడంతో రాత్రిళ్ళు బయటకు రావడానికి జంకుతున్నారు జనం.
చిత్తూరు జిల్లాలో రెండురోజుల క్రితం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పలమనేరు మండలం పెంగరగుంట పంచాయతీ ఇంద్రానగర్ గ్రామ శివారులోని పంటపొలాలపై ఏనుగుల గుంపు దాడిచేసి నాశనం చేసాయి. ఈ క్రమంలోనే పొలం వద్దే ఇటిని నిర్మించుకుని జీవిస్తున్న ఓ వ్యక్తిపై దాడిచేసి చంపేసాయి. అసోంలోనూ ఏనుగుల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం విషాదం నింపింది. ఇలా వరుస ఘటనలతో విషాదం నింపింది.
Conjuring House: రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన దెయ్యాల కొంప