Cannibalism: సాధారణంగా కొన్ని జంతువులు మాత్రమే తన వర్గంలోని జంతువులను చంపి తింటుంటాయి. అయితే, పులుల వంటి జంతువులు పులి పిల్లల్ని చంపి తినడం చాలా అరుదు. అయితే మహారాష్ట్రలోని తాడోబా-అంధేరీ అభయారణ్యంలో మాత్రం ఓ పులి మాత్రం చిన్న పులి పిల్లల్ని చంపి తింటున్నట్లు తెలిసింది. రెండు పులుల నిర్వహించిన శవపరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. మరణించిన పులులను ఆరేళ్ల టీ-142, రెండేళ్ల టీ-92గా గుర్తించారు.
మాములుగా అయితే కుక్కలను ఎంతో ముద్దుగా ఇష్టంగా పెంచుకుంటాం. ఏటైనా బయటకు వెళ్లినప్పుడు వాటి మెడకు గొలుసు కట్టి తీసుకెళ్తుంటాం. కానీ పాకిస్తాన్ లో మాత్రం ఓ పిల్లవాడు మాత్రం ఏకంగా పులికే గొలుసును కట్టి ఏం చక్కా పట్టుకుని తిరుగుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాకిస్థాన్‌కు చెందిన నౌమాన్ హసన్ అనే వ్యక్తి తన పెంపుడు పులులను వీడియోలలో ప్రదర్శించడం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. చాలా…
రైతుపై దాడి చేసి చంపిన పులిని చంపాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రాణాంతక చర్యలను ఆశ్రయించే ముందు పులి నరమాంస భక్షకమని అధికారులు నిర్ధారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు.
Bear and Tiger Viral Video: ఈ మధ్య వైరల్ అవుతున్న వీడియోలు చూస్తుంటే అసలు ఇలాంటివి కూడా జరుతాయా అని ఆశ్చర్యం కలుగుతుంది. క్రూర జంతువులు సైతం తమ నైజానికి విరుద్దంగా ప్రవర్తిస్తున్నాయి. సింహంతో యువతి ఆడుకోవడం, రెండు సింహాల మధ్య ఓ వ్యక్తి కూర్చొని వాటినే చెప్పుతో కొట్టడం, ఈ మధ్య చిరుతతో తాబేలు ఫుడ్ షేర్ చేసుకోవడం లాంటి వీడియోలు వైరల్ అయ్యాయి. ఇవి మాత్రమేనా క్రూరజంతువైన సింహం చెట్టు కొమ్మలను లాక్కోని…
TTD Operation Cheetah successfully completed: తిరుమల శేషాచలం కొండల్లో ‘ఆపరేషన్ చిరుత’ విజయవంతంగా ముగిసింది. గత వారం రోజులుగా తప్పించుకుంటూ తిరుగుతున్న చిరుత.. ఎట్టకేలకు ఆదివారం (ఆగష్టు 27) రాత్రి బోనులో చిక్కింది. దాంతో అలిపిరి కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు ఊరట లభించింది. బోనులో చిక్కిన చిరుతను తిరుపతి జూపార్క్‌కు తరలించినట్లు అటవీశాఖ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ (సీసీఎఫ్‌వో) తెలిపారు. చిరుత రక్త నమూనాలు సేకరించి.. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గత కొన్నిరోజులుగా…
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్శిటీ ప్రాంగణంలోకి పులి ప్రవేశించింది. అందుకు సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో విషయం బయటపడింది.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకా పరిసరాల్లో కొంతకాలంగా పులి సంచరస్తుంది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురి అవుతున్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే, గురువారంనాడు ఉదయం మూల్ తాలూకాలోని ఎస్గావ్ గ్రామ పరిసరాల్లో ఓ పశువుల కాపరిపై పులి దాడికి యత్నించిందని.. చేతిలో ఉన్న గొడ్డలితో ఎదురు తిరగడంతో త్రుటిలో అతడికి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.
ఒక చిన్న బాతు పులిని తప్పించగలదని ఎవరైనా అనుకోగలరా?. కానీ అలాంటి దృశ్యమే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో కనిపిస్తోంది. ఈ క్లిప్‌ను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో షేర్ చేశారు.
పులి పంజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుందంటే దానిని వెంటాడి వేటాడే వరకు వదలదు. అడవుల్లో ఆహారం లేక పులులు నిత్యం గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పశువులపై దాడి చేయాలని భావించిన పులికి ఎదురు దెబ్బ తగిలింది.