'ధమాకా', 'వాల్తేర్ వీరయ్య' సక్సెస్ తర్వాత 'రావణాసుర'తో రవితేజ హ్యాట్రిక్ కొడతాడని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. దాంతో ఇక 'రావణాసుర' తమిళ, హిందీ వర్షన్స్ విడుదలపై నీలిమేఘాలు ఆవరించినట్టే!
క్రిష్ సిద్ధిపల్లి హీరోగా నటిస్తున్న సినిమా 'రేవ్ పార్టీ'. ఈ తరహా పార్టీలు ఎలా జరుగుతుంటాయి, అందులో ఎలాంటి డ్రగ్స్ వాడుతుంటారు? రాజకీయనేతలు ఈ తరహా పార్టీలను ఎందుకు ప్రోత్సహిస్తారనే అంశాలను ఈ సినిమాలో స్పృశించబోతున్నారు దర్శకుడు రాజు బోనగాని.
మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో మొదటిసారి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’. 70’ల కాలంలో స్టువర్ట్ పురంలో గజదొంగగా పేరు తెచ్చుకున్న ‘నాగేశ్వర రావు’ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. డిపార్ట్మెంట్ కి అతను దొంగ కావొచ్చేమో కానీ నాగేశ్వర రావుకి జనరల్ పబ్లిక్ లో మాత్రం ‘ఇండియన్ రాబిన్ హుడ్’ అనే ఇమేజ్ ఉంది. ఈ పాయింట్ ని బేస్ చేసుకొనే టైగర్ నాగేశ్వర రావు సినిమా రూపొందుతుంది.…
మాస్ మహరాజా రవితేజ నటించిన 'రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాల డబ్బింగ్ కార్యక్రమాలు సోమవారం మొదలయ్యాయి. ఇందులోని 'రావణాసుర' ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది.
‘టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కోరాజా’ వంటి వరుస ప్లాప్స్ తర్వాత ‘క్రాక్’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ మళ్ళీ ‘ఖిలాడి’తో డౌన్ అయ్యాడు. ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాక, టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’లో స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే దాదాపు పూర్తయిన ‘రామారావు ఆన్ డ్యూటి’ సినిమాను రవితేజ పక్కన పెట్టేశాడనే వార్తలు వినవస్తున్నాయి.…
ఈ మధ్య పాత టైటిల్‌తో కొత్త సినిమాలు రావడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలా సినిమాలు పాత టైటిల్‌తో కొత్తగా వచ్చాయి. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖుషి’ టైటిల్‌తో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఖుషి సినిమా వచ్చి రెందు దశాబ్దాలు దాటిపోయింది.. కాబట్టి నో ప్రాబ్లమ్. కానీ ఇప్పుడు ముగ్గురు హీరోలు ఒకే టైంలో.. ఒకే టైటిల్‌తో రాబోతున్నారు. కాకపోతే వాటికి ముందు, వెనక ఒక…
ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా, బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ఈయన లైన్‌లో పెడుతున్నాడు. ఆల్రెడీ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ.. తాజాగా ఓ తమిళ దర్శకుడితో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ధనుష్‌తో ‘మారి’, ‘మారి2’ సినిమాలు తీసిన బాలాజీ మోహన్! ఈ డైరెక్టర్ సిద్ధార్థ్‌తో ‘లవ్ ఫెయిల్యూర్’ అనే మరో…