‘టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కోరాజా’ వంటి వరుస ప్లాప్స్ తర్వాత ‘క్రాక్’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ మళ్ళీ ‘ఖిలాడి’తో డౌన్ అయ్యాడు. ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాక, టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’లో స్పెషల్ రోల్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే దాదాపు పూర్తయిన ‘రామారావు ఆన్ డ్యూటి’ సినిమాను రవితేజ పక్కన పెట్టేశాడనే వార్తలు వినవస్తున్నాయి. ఫైనల్ అవుట్‌పుట్ బాగా లేదనేదే అందుకు కారణం అంటున్నారు. నిజానికి సినిమాలో కొంత భాగాన్ని రీ-షూట్ చేశారు కూడా. ఫైనల్ ఎడిటింగ్ జరుగుతోంది. రవితేజ చూసి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ టైమ్ లో రవితేజ దర్శకుడికి అందుబాటులో లేకుండా తదుపరి ప్రాజెక్ట్ కి షిప్ట్ అయ్యాడట.
రవితేజ ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’ షూటింగ్ మొదలెట్టాడట. దీనికోసం హెయిర్‌స్టైల్ తో పాటు లుక్ కూడా మర్చాడట. ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రాజెక్ట్ పై రవితేజ పూర్తి అసంతృప్తితో ఉన్నాడని అందుకే దానికి దూరంగా జరిగాడని టాక్. అయితే ఈ సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి రానాతో తీసిన ‘విరాటపర్వం’ సినిమా విడుదలతో బిజీగా ఉన్నాడు. మరి ఆ సినిమా రిలీజ్ టైమ్ లో ‘రామారావు అన్ డ్యూటీ’ రిలీజ్ విషయంలో ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. ఏది ఏమైనా రవితేజ రామారావును పూర్తి చేసి పక్కన పెట్టి నాగేశ్వరారావును ముందుకు తీసుకుని వెళుతున్నాడన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో!?