మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో మొదటిసారి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’. 70’ల కాలంలో స్టువర్ట్ పురంలో గజదొంగగా పేరు తెచ్చుకున్న ‘నాగేశ్వర రావు’ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. డిపార్ట్మెంట్ కి అతను దొంగ కావొచ్చేమో కానీ నాగేశ్వర రావుకి జనరల్ పబ్లిక్ లో మాత్రం ‘ఇండియన్ రాబిన్ హుడ్’ అనే ఇమేజ్ ఉంది. ఈ పాయింట్ ని బేస్ చేసుకొనే టైగర్ నాగేశ్వర రావు సినిమా రూపొందుతుంది. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు ఈ పీరియాడిక్ డ్రామాలో రవితేజ పక్కన హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ భారి బడ్జట్ సినిమాని వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు.
Read Also: Ileana: గోవా పాపకి సినిమాలు లేవు… సాంగ్స్ చేసుకుంటుంది…
రవితేజ కెరీర్ లోనే అత్యధిక బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు సినిమా ఫైనల్ లెగ్ ఆఫ్ షూటింగ్ కి చేరుకుంది. ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ని వైజాగ్ లో స్టార్ట్ చేశారు. భారి ఖర్చుతో హ్యుజ్ సెట్ వేసి టైగర్ నాగేశ్వర రావు షూటింగ్ చేస్తున్నారు. వైజాగ్ షెడ్యూల్ తో ఈ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్న టైగర్ నాగేశ్వర రావుపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. వాటిని ఈ మూవీ ఎంతవరకూ రీచ్ అవుతుందో తెలియాలి అంటే సమ్మర్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.
#TigerNageswaraRao final schedule begins at a huge set on the coastline of Vizag💥💥
Many More updates soon 🔥🔥
Mass Maharaja @RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher @iam_RenuDesai @NupurSanon @gaya3bh @gvprakash @artkolla @MayankOfficl pic.twitter.com/fQGre5SWp9
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) March 5, 2023