Ravi Teja: ధనుష్ దర్శకుడితో సినిమా ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా, బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ఈయన లైన్‌లో పెడుతున్నాడు. ఆల్రెడీ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ.. తాజాగా ఓ తమిళ దర్శకుడితో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ధనుష్‌తో ‘మారి’, ‘మారి2’ సినిమాలు తీసిన బాలాజీ మోహన్! ఈ డైరెక్టర్ సిద్ధార్థ్‌తో ‘లవ్ ఫెయిల్యూర్’ అనే మరో సినిమా కూడా తీశాడు.
రవితేజతో ఓ సినిమా చేయాలని బాలాజీ చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నాడు. తనకు కథ నరేట్ చేసేందుకు సమయం ఇవ్వాలని కోరుతూ వస్తున్నాడు. ఎట్టకేలకు రవితేజ అతని కోరికని మన్నించి, కాస్త సమయం ఇచ్చాడు. అతని ఫైనల్ నరేషన్‌తో ఇంప్రెస్ అయిన రవితేజ.. మరో ఆలోచన చేయకుండా సినిమాకి పచ్చజెండా ఊపేసినట్టు తెలిసింది. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ని భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. రవితేజ శైలికి తగినట్టే ఇది ఔట్ అండ్ ఔట్ మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా రూపొందనుందట! త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికార ప్రకటన రానుంది.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇదిలావుండగా.. ప్రస్తుతం రవితేజ చేస్తోన్న సినిమాల్లో రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్‌కి ముస్తాబవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ చిత్రం.. జూన్ 17వ తేదీన రిలీజ్ కానుంది. అటు.. ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు సైతం శరవేగంగా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. రవితేజ తీరిక సమయం తీసుకోకుండా, ఏకకాలంలో ఈ సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటున్నాడు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!