టాలీవుడ్ మాస్ మహారాజ అంటే చాలు మనకు గుర్తుకు వచ్చేది రవితేజ. ఆయన మాటలకు , ఆయన చేష్టలకు కామిడీకి కడుపుబ్బ నవ్వుకోవాల్సిందే అభిమానులు. కిక్ కోసం ఏమైన సరే చేయడానికి వెనుకాడని రవితేజ ఇప్పుడు దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నాడట. అంత అవసరం ఏమోచ్చింది రవితేజాకి అనుకుంటున్నారా. అసలు రవితేజ ఇప్పుడు దొంగలా మారడానికి కారణం ఒకటి వుంది. అదిఏమిటంటే.. రవితేజ ఈ మెళకువలన్నీ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కోసమే. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నాగేశ్వరరావు పాత్రను రవితేజ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకున్నారు. అలాగే సంభాషణలు పలికే తీరు కూడా వినూత్నంగా ఉంటుందని టాక్.
రవితేజ నటిస్తున్న ఈ తొలి పాన్ ఇండియా చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నైట్ షూట్ జరుగుతోంది. ఈ సెట్‌లో జరుగుతున్న సందడి తాలూకు వీడియోను రవితేజ షేర్ చేశారు. నాగేశ్వరరావు రాత్రిపూట చేసే దొంగతనానికి సంబంధించిన సీన్స్‌ని చిత్రీకరిస్తున్నారని సమాచారం. రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్ నిర్మాత.
తాజాగా తన 71వ సినిమాకు సంబంధించిన ప్రాజెక్ట్ ను 2021 నవంబర్ 3న అప్డేట్ చేశారు. ఇందులో భాగంగా రవితేజ దొంగగా కనిపించబోతోన్నాడని.స్టువర్ట్ పురంలోని గజ దొంగ జీవిత చరిత్ర ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారని. టైగర్ నాగేశ్వర రావు అంటూ రాబోతోన్న ఈ సినిమా 1970 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుందని వెల్లడించారు. గత మూడేళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అప్పట్లో ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ పవర్ ఫుల్ రోల్‌ను పోషించేందుకు రవితేజ పూర్తిగా తన శరీరాకృతిని మార్చుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేస్, యాసతో రవితేజ ఆకట్టుకోబోతోన్నట్టు కనిపిస్తోంది. టైటిల్ పోస్టర్లో రవితేజ పిక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. నరాలు అలా మెలితిరిగి కనిపిస్తున్నాయి. రైలు వెంబడి పరిగెత్తుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి గజదొంగగా రవితేజ అందరినీ భయపెట్టబోతోన్నాడన్న మాట.
2003లో దొంగోడు చిత్రంలో దొంగగా వరితేజ చేసిన అల్లరి అంతా ఇంతాకాదు. రవితేజ సరసన కళ్యాణి నటించి ఇద్దరు జోడి అభిమానులకు నవ్వులు పూయించాయి. అప్పట్లో దొంగగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రవితేజ మరి టైగర్ నాగేశ్వరావు లోని దొంగ పాత్రతో రవితేజ ఎలా మెప్పిస్తాడో అంటూ అభిమానులు ఆశక్తి కరంగా ఎదురు చూస్తున్నారు.
Dallas: ఈ నెల 25న వైభవంగా శ్రీనివాసుడి కల్యాణం