ప్రతిభ ఎక్కడ ఉన్నా, పట్టుకు వచ్చి మరీ పట్టం కట్టడంలో తెలుగువారు అందరికంటే ముందుంటారు. ఇక సినిమా రంగంలోవారినైతే మరింతగా ఆదరిస్తారు. అలా తెలుగువారి ఆదరణ చూరగొంటున్న అదృష్టవంతుల్లో తమిళ టాప్ స్టార్స్ లో ఒకరైన విజయ్ చోటు సంపాదించాడు. నిజానికి విజయ్ ఒక్క తెలుగు చిత్రంలోనూ హీరోగా నటించలేదు. కానీ, ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడి వారినీ అలరిస్తున్నాయి. విజయ్ కి తెలుగు సినిమా రంగంతో సంబంధం లేదని చెప్పలేం. ఎందుకంటే విజయ్…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ విజయ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ప్రస్తుతం విజయ్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే., తాజాగా ఆ సినిమాకు ‘వారిసు’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసం రష్మిక నటిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆఫీస్ ఆవరణలో శవం దొరకడం ప్రస్తుతం సంచలనంగా మారింది. విజయ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడన్న విషయం విదితమే. ఇక విజయ్ రాజకీయాల్లోకి రావాలని, ముందుగానే అతని తండ్రి, అభిమానులు కలిసి ఆయన పేరున ‘విజయ్ మక్కల్ ఇయక్కం పార్టీ’ని స్థాపిస్తూ చెన్నై శివార్లలో పార్టీ ఆఫీస్ ను కూడా నిర్మించారు. ఇక రాజకీయాలు అని కాకుండా ఏమైనా సేవా కార్యక్రమాలు ఉంటే విజయ్…
ఇటీవల వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ బీస్ట్ సినిమాపై.. భారీ ఆశలు పెట్టుకున్నారు దళపతి ఫ్యాన్స్. కానీ కెజియఫ్ చాప్టర్2కి పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ విషయంలో విజయ్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. దాంతో ఈ సారి ఎలాగైనా సరే.. ఫ్యాన్స్‌కు భారీ హిట్ ఇచ్చి జోష్ నింపాలని చూస్తున్నాడు విజయ్. అందుకే అప్ కమింగ్ ఫిల్మ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే వరుసగా యాక్షన్…
గత కొన్ని రోజుల నుంచి లోకేష్ కనగరాజ్ తరచూ వార్తల్లోకెక్కుతున్నాడు. ఓవైపు ‘విక్రమ్’ సినిమా, మరోవైపు రామ్ చరణ్ & విజయ్‌లతో జోడీ కట్టడంపై ఆసక్తికరమైన వార్తలు ఒకదాని తర్వాత మరొకటి వస్తున్నాయి. ఈ క్రమంలోనే లోకేష్ ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. దళపతి విజయ్‌తో తాను మరో సినిమా చేస్తున్నానని అధికారికంగా వెల్లడించాడు. నిన్న రాత్రి జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో ఆ దర్శకుడు ఈ ప్రకటన చేశాడు. ఇదివరకే లోకేష్ – విజయ్ కాంబోలో…
దళపతి విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో బిగ్ స్టార్ కాస్ట్ తో ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న భారీ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా రాబోతోంది. విశేషం ఏమంటే… మనకు సంక్రాంతి పండగలానే తమిళనాడులోనూ పొంగల్ ను గ్రాండ్ గా చేసుకుంటారు. ఈ సీజన్ లో విడుదలైన విజయ్ చిత్రాలు అనేకం సూపర్ సక్సెస్ అయ్యాయి. దాంతో సెంటిమెంట్ గానూ ఇదే సరైన తేదీ అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మికా…
‘పూజా మన కాజా…. ఆమె లెగ్ పెడితే సూపర్ హిట్’ అంటూ ‘బీస్ట్’ను తెలుగులో విడుదల చేసిన ‘దిల్’ రాజు ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె నటించిన ‘డీజే, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని ఉదాహరణగా పేర్కొన్నారు. పూజా హెగ్డే ఇప్పుడు ఆల్ ఇండియా హీరోయిన్, పాన్ ఇండియా హీరోయిన్, సినిమా సినిమాకూ ఆమె నటిగానూ ఎంతో పరిణతి చూపుతోందని కితాబిచ్చారు. అయితే…
ప్రస్తుతం సినిమా ఎలా ఉంది అన్నదానికన్నా ఆ సినిమా ప్రమోషన్స్ ఎలా చేశారు అనేదాని గురించే ప్రేక్షకులు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకురావాలంటే ముందు దానికి ప్రమోషన్స్ చేసి జనాలలో ఆ పేరును నానిస్తే అప్పుడు ఆ ప్రొడక్ట్ విలువ పెరుగుతుంది. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ అందరు ఇదే ఫార్ములాను పాటిస్తున్నారు. సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీశామన్నది కాదు ప్రమోషన్స్ కి ఎన్ని కోట్లు ఖర్చుపెడుతున్నాం అనేది ముఖ్యం అంటున్నారు…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్లో భాగంగానే ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ తో ఈ సినిమా చిక్కుల్లో పడింది. ఒక గూఢచారి అయిన హీరో షాపింగ్ మాల్ ని హైజాక్…
వచ్చే వారం వివిధ భాషలకు చెందిన, మూడు విభిన్న కథా చిత్రాలు వెండితెరపై వెలుగులు విరజిమ్మబోతున్నాయి. ఇళయ దళపతి విజయ్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘బీస్ట్’ ఏప్రిల్ 13న అంటే బుధవారం రాబోతోంది. ఆ రోజుకో ప్రత్యేకత ఉంది. ఏప్రిల్ 15 గుడ్ ఫ్రైడే. దానికి ముందు వచ్చే బుధవారాన్ని క్రైస్తవులు ‘హోలీ వెడ్ నెస్’ గా భావిస్తారు. అందుకే తన ‘బీస్ట్’ చిత్రాన్ని శుక్రవారానికి రెండు రోజుల ముందే ప్రపంచవ్యాప్తంగా విజయ్ విడుదల చేయబోతున్నాడు.…