ఇటీవల వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ బీస్ట్ సినిమాపై.. భారీ ఆశలు పెట్టుకున్నారు దళపతి ఫ్యాన్స్. కానీ కెజియఫ్ చాప్టర్2కి పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ విషయంలో విజయ్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. దాంతో ఈ సారి ఎలాగైనా సరే.. ఫ్యాన్స్‌కు భారీ హిట్ ఇచ్చి జోష్ నింపాలని చూస్తున్నాడు విజయ్. అందుకే అప్ కమింగ్ ఫిల్మ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే వరుసగా యాక్షన్ చిత్రాలకే పరిమితమైన విజయ్.. ఈ సారి రూట్ మార్చాడు. అందుకే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. ఓ ఫ్యామిలీ స్టోరీతో రాబోతున్నాడు. విజయ్ తెలుగులో చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ కూడా ఇదే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్నారు. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. విజయ్ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
తాజాగా ఈమూవీకి సంబంధించి కీలక షెడ్యూల్ పూర్తయినట్లుగా ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ మొదటి వారంలో మొదలైన ఈ సినిమా షూటింగ్‌ను.. రోజుల్లోనే మేజర్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసి ఆశ్చర్యపరిచారు. లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశామని.. ఈ షెడ్యూల్‌లో చాలా కీలక సన్నివేశాలు షూటింగ్ చేశామని.. ఓ ఫోటో షేర్ చేశారు మేకర్స్. దాంతో విజయ్ ఈ సినిమాను జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేయబోతున్నాడని చెప్పొచ్చు. ఇక విజయ్ 66 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో.. హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తోంది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్ లాంటి సీనియర్ నటులతో.. భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతోంది ఈ సినిమా. దాంతో షూటింగ్ ఓ పండగలా జరుగుతోందని అంటున్నారు. ఇక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసారి ఫ్యామిలీ స్టోరీతో విజయ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.