ప్రస్తుతం సినిమా ఎలా ఉంది అన్నదానికన్నా ఆ సినిమా ప్రమోషన్స్ ఎలా చేశారు అనేదాని గురించే ప్రేక్షకులు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకురావాలంటే ముందు దానికి ప్రమోషన్స్ చేసి జనాలలో ఆ పేరును నానిస్తే అప్పుడు ఆ ప్రొడక్ట్ విలువ పెరుగుతుంది. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ అందరు ఇదే ఫార్ములాను పాటిస్తున్నారు. సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీశామన్నది కాదు ప్రమోషన్స్ కి ఎన్ని కోట్లు ఖర్చుపెడుతున్నాం అనేది ముఖ్యం అంటున్నారు మేకర్స్.. స్టార్ హీరో దగ్గరనుంచి చిన్న హీరోవరకు ప్రమోషన్స్ లో సక్సెస్ అయితే సినిమా సక్సెస్ అయ్యినట్లే. మొన్నటివరకు ఆర్ఆర్ఆర్ హావా ఎలా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు కెజిఎఫ్ 2 హవా కూడా అలాగే సాగుతోంది. అయితే మధ్యలో ప్రమోషన్స్ కొద్దిగా వెనుక ఉన్నది బీస్ట్.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 13 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మిగతా హీరోల లా విజయ్ ప్రమోషన్స్ కి అటెండ్ కావడం లేదు.. అందరు హీరోలు తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి అన్ని ఊర్లు తిరిగి తమ సినిమా గురించి చెప్తుంటే.. విజయ్ కనీసం ఇంటర్వ్యూ లకు కూడా అటెండ్ కావడం లేదు. హీరో లేకుండా సినిమా ప్రమోషన్స్ చేయడం అంటే ఎలా ఉంటుందో అందరికి తెల్సిందే.
ఇక తాజాగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తాను ఎందుకు ప్రమోషన్స్ కి రావడం లేదో క్లారిటీ ఇచ్చాడు. ‘ నేను ప్రమోషన్స్ కు కానీ, ఇంటర్వ్యూ లకు కానీ రాను.. అయితే దానికి కారణమ్ నేనేదో బిజీగా ఉన్నాను.. వేరే సినిమా షూటింగ్ లో ఉన్నాను అని కాదు.. నిజం చెప్పాలంటే నేను చాలా ఫ్రీగా ఉన్నాను. కానీ.. పదేళ్ల నుంచి నేను మీడియాకు దూరంగా ఉండడానికి ఒక పెద్ద కారణం ఉంది. పదేళ్ల క్రితం నేను కూడా ప్రమోషన్స్ లో పాల్గొన్నాను. అయితే అక్కడ నేను చెప్పిన ఒక మాటను వేరేవిధంగా అర్ధం చేసుకొని మీడియా రాసుకొచ్చింది. దాంతో ఆ వ్యాఖ్యలు నన్ను వివాదంలోకి నెట్టాయి. ఆ వివాదం తరువాత నేను ప్రమోషన్స్ కి కానీ, ఇంటర్వ్యూ లకు కానీ అటెండ్ అవ్వడం లేదు’ అని చెప్పుకొచ్చాడు. దీంతో మీడియాను దూరం పెడుతున్న విజయ్ అనే వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది. అయితే ఎప్పుడో ఏదో జరిగిందని సినిమా ప్రమోషన్స్ ని ఆపుకుంటామా..? మీరు ఇలా చేయకూడదు విజయ్.. రాసేవాళ్లు రాస్తూనే ఉంటారు. అవన్నీ పట్టించుకోకండి అంటూ విజయ్ ఫ్యాన్స్ ఆయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.