గత కొన్ని రోజుల నుంచి లోకేష్ కనగరాజ్ తరచూ వార్తల్లోకెక్కుతున్నాడు. ఓవైపు ‘విక్రమ్’ సినిమా, మరోవైపు రామ్ చరణ్ & విజయ్‌లతో జోడీ కట్టడంపై ఆసక్తికరమైన వార్తలు ఒకదాని తర్వాత మరొకటి వస్తున్నాయి. ఈ క్రమంలోనే లోకేష్ ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. దళపతి విజయ్‌తో తాను మరో సినిమా చేస్తున్నానని అధికారికంగా వెల్లడించాడు. నిన్న రాత్రి జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌లో ఆ దర్శకుడు ఈ ప్రకటన చేశాడు.
ఇదివరకే లోకేష్ – విజయ్ కాంబోలో ‘మాస్టర్’ సినిమా వచ్చింది. దానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం భారీగానే కురిపించింది. ఆ సమయంలోనే వీరి కాంబో మరోసారి సెట్ కావొచ్చనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజుల నుంచి అదే ప్రచారం ఊపందుకుంది. అది నిజమేనని తాజాగా ధృవీకరించి.. ఈ దర్శకుడు ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపాడు. ఆల్రెడీ మాస్టర్‌తో మంచి హిట్ ఇచ్చాడు కాబట్టి, ఈసారి అంతకుమించిన సినిమాతోనే అలరిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
కాగా.. ప్రస్తుతం లోకేష్ తన ‘విక్రమ్’ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు.. విజయ్ మన తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. బహుశా ఈ సినిమా పూర్తయ్యాకే లోకేష్ – విజయ్ మరోసారి జట్టు కడతారేమో! మరి, రామ్ చరణ్‌తో లోకేష్ చేస్తానన్నా ప్రాజెక్ట్ సంగతేంటి?