కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ విజయ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ప్రస్తుతం విజయ్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే., తాజాగా ఆ సినిమాకు ‘వారిసు’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసం రష్మిక నటిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే తమిళ్ మార్కెట్ కోసం దిల్ రాజు బాగా ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇందు కోసం విజయ్ ను బాగా లేపుతున్నాడని పలువురు నొక్కివక్కాణిస్తున్నారు.
ఇక రేపు విజయ్ బర్త్ డే కానుకగా ఆర్టీసీ క్రాస్ రాడ్స్ లో ఉన్న సుదర్శన్ థియేటర్ లో విజయ్ నటించిన ‘తుపాకీ’ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ వేయిస్తున్నాడట. విజయ్ అభిమానుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా దేనికోసం దిల్ రాజు చేస్తున్నాడు అంటే.. ప్రస్తుతం తెలుగులో బడా నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు.. ముందు ముందు అన్ని భాషల్లోనూ తమ సంస్థను ప్రమోట్ చేయాలనీ చూస్తున్నాడట.. దివంగత నిర్మాత రామానాయుడు లా అన్ని భాషల్లో తమ సంస్థ సినిమాలు నిర్మించాలని, అందుకోసమే కోలీవుడ్ స్టార్ హీరోలను లేపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే శంకర్ ను రప్పించి చరణ్ తో ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే.. ఇప్పుడు విజయ్ తో ఒక సినిమా చేస్తున్నాడు.. వీటి వలన దిల్ రాజు తమిళ్ మార్కెట్ పెరిగినట్లే కనిపిస్తోంది. ఇక ఈ రెండు సినిమాలు కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే తమిళ్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కోలీవుడ్ లో పాతుకుపోయినట్లే.. మరి ముందు ముందు దిల్ రాజు అన్ని భాషల్లో సినిమాలు నిర్మించి మరో రామానాయుడు అవుతాడేమో చూడాలి.