ఇంటర్నెట్ వచ్చాకా సినీ అభిమానుల పని సులువు అయ్యింది. ఒకప్పుడు ఒక సినిమాలో సీన్ ను కాపీ కొడితే ఇది ఎక్కడో చూసినట్లు ఉందే అనుకోనేవాళ్ళు..కానీ, సోషల్ మీడియా వచ్చాకా నిమిషాల్లో అది ఎక్కడి నుంచి కాపీ కొట్టారో.. వెతికి మరీ స్క్రీన్ షాట్స్ పెట్టేస్తున్నారు. ఒక్క సీన్ ఏంటీ.. సాంగ్, పోస్టర్, చివరికి హీరోలు వేసుకున్న డ్రెస్ లను కూడా కాపీ అని చెప్పేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన కొత్త చిత్రం ‘వారసుడు’ పోస్టర్స్ కూడా కాపీ అంటున్నారు నెటిజన్స్.. మరి ముఖ్యంగా తాజాగా రిలీజ్ చేసిన సెకండ్ లుక్ అచ్చు గుద్దినట్లు రజినీకాంత్ పోస్టర్ ను దింపేసారని చెప్పుకొస్తున్నారు. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘వారిసు’. తెలుగులో వారసుడు గా రిలీజ్ కానుంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక నేడు విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రెండు పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. అయిదు ఈ రెండు పోస్టర్లు కూడా వేరే హీరోల పోస్టర్లను కాపీ కొట్టిన్నట్లు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి పోస్టర్ మహర్షి సినిమా పోస్టర్ ను గుర్తుచేస్తోందని చెప్పుకొస్తున్నారు. మహేష్ బాబు సూట్ లో ఠీవిగా నడిచివస్తున్న పోస్టర్ ను అటు ఇటు మార్చి విజయ్ పోస్టర్ ను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండవ పోస్టర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి చిత్రంలోనిది అని చెప్పుకొస్తున్నారు.
రజినీ స్టైలిష్ లుక్ తో.. ఎడ్ల బండిలో కాలు మీద కాలు వేసుకొని పడుకొని కనిపిస్తాడు.. అదే పోజ్ ను కాపీ కొట్టాడు విజయ్.. ఈ సెకండ్ లుక్ పోస్టర్ లో విజయ్ కూడా ఒక వాహనంలో కాలు మీద కాలు వేసుకొని స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఇక కొద్దిగా మార్పు ఏదైనా ఉంది అంటే చుట్టూ చిన్నపిల్లలను, చెరుకు గడలను, గాలిపటాలను చేర్చి కలర్ ఫుల్ గా మార్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలను పక్కపక్కన పెట్టి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.. రిలీజ్ చేసిన రెండు పోస్టర్లు కాపీయే.. పోస్టర్లేనా .. సినిమా కూడా కాపీనేనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి.. మరికొద్దిసేపట్లో రిలీజ్ కాబోయే మూడో పోస్టర్ ఎలా ఉండనున్నదో చూడాలి.
Sankranthi 2023 is going to be special with the arrival of #Vaarasudu #VaarasuduSecondLook#Vaarasudu#Varisu#HBDDearThalapathyVijay
Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Cinemainmygenes @KarthikPalanidp pic.twitter.com/GySYHlT488
— Sri Venkateswara Creations (@SVC_official) June 22, 2022