5 Army Personnel Killed In Blast During Jammu Anti-Terror Op: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో.. ఐదుగురు జవాన్లు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు చేపట్టిన జమ్ముకశ్మీర్ యాంటీ-టెర్రర్ ఆపరేషన్‌లో భాగంగా.. ఉగ్రవాదులున్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో వాళ్లు ఎదురుకాల్పులు జరపగా.. ఐదుగురు జవాన్లు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఇద్దరు సైనికులు స్పాట్‌లోనే మరణించగా.. మరో నలుగురు తీవ్ర గాయాలపాలవ్వడంతో, వారిని ఉధంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ముగ్గురి పరిస్థితి విషమించడంతో, వాళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరొకరికి చికిత్స అందిస్తున్నారు. రాజౌరి జిల్లాలోని కంది ప్రాంతంలో కేస్రీ హిల్ వద్ద ఈ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఒక గుహలో ఉగ్రవాదుల గుంపు ఉన్నట్లు తమకు నిర్దిష్ట సమాచారం అందిందని సైన్యం తెలిపింది. ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను వినియోగించారని ఓ అధికారి తెలిపారు.
MP Revenge Story: పదేళ్ల నాటి పగ.. పట్టపగలే ఆరుగురిని కాల్చి చంపారు
కాగా.. ఏప్రిల్ 20వ తేదీన పూంచ్ జిల్లాలోని భాటా ధురియన్ వద్ద ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదుల బృందం దాడి చేసిన విషయం తెలిసిందే! ఈ దాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. అంతేకాదు.. సైనికుల ఆయుధాలు తీసుకొని ఉగ్రవాదులు పారిపోయారు. అప్పటి నుంచి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు జమ్ము యాంటీ టెర్రర్ ఆపరేషన్‌ని మొదలుపెట్టారు. ‘‘జమ్ములోని భాటా ధురియన్‌లో టోటా గలి ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై ఆకస్మిక దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల సమూహాన్ని బయటకు తీసేందుకు.. ఇండియన్ ఆర్మీ నిఘా ఆధారిత కార్యకలాపాలను నిర్వహిస్తోంది’’ అని ఓ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి సమీపంలోని అదనపు బలగాలను రప్పించామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల బృందం చిక్కుకున్నట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని, ఉగ్రవాద సమూహంలో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
Ravindar Singh : అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది