J&K Terror Attacks: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారు జైలుకు వెళ్తారు లేదా ‘నరకానికి’ వెళ్లారని రాజ్యసభలో కేంద్రం హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం సమాధానమిచ్చారు. ఉగ్రవాదాన్ని మోడీ సర్కార్ సహించబోదని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)కి సమీపంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని కెరాన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖకు సమీపంలో కాల్పులు జరిగాయి. ఇంకా కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న వరస ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అత్యున్నత భద్రతా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్‌లో వరసగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతంలో రెచ్చిపోతున్నారు.
జమ్మూలోని కథువాలో ఆర్మీ జవాన్లపై ఉగ్రదాడి జరిగిందన్న పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ జరిగిన ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. సోమవారం సాయంత్రం ఈ దాడి వార్త వెలుగులోకి వచ్చింది.
Sanjay Raut: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. బుధవారం రౌత్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్‌లోని టెర్రర్ దాడులపై అమిత్ షాని టార్గెట్ చేశారు. అమిత్ షా ప్రతిపక్షాలను తుడిచిపెట్టే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు.
Baba Vanga: బాబా వంగా ప్రత్యేకంగా పేరును పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎప్పుడో మరణించినా ఆమె చెప్పినవన్నీ చెప్పినట్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయనే విషయాలను ఊహించి జోస్యం చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటి వరకు ఈ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త చెప్పినవి కొన్ని నిజాలయ్యాయి.
Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ వరస ఎన్కౌంటర్లతో అట్టుడుకుతోంది. బుధవారం నుంచి కాశ్మీర్ ప్రాంతంలో ఏదో చోట ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంటుంది. శనివారం బారాముల్లా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభం అయింది. మరోవైపు రాజౌరీలో శుక్రవారం నుంచి ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది. రాజౌరీ ఎన్‌కౌంటర్ ఇప్పటికే 9 పారా కమాండో దళానికి చెందిన నలుగురు జవాన్లు, సైన్యానికి చెందిన ఒకరు మొత్తం ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.