Jammu Kashmir: కాశ్మీర్‌లో మరో 2000 మంది బీఎస్ఎఫ్ జవాన్ల మోహరింపు..
- జమ్మూ కాశ్మీర్‌లో అదనపు బలగాల మోహరింపు..
- ఒడిశా నుంచి 2000 మంది బీఎస్ఎఫ్ బలగాల తరలింపు..
- పెరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్రం చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ ఇటీవల కాలంలో ఉగ్రదాడులు పెరగడం, సరిహద్దు వెంబడి చొరబాటు ప్రయత్నాలు ఎక్కువ కావడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూలోని భారత్-పాకిస్తాన్ వెంబడి భద్రతను పటిష్టం చేసేందుకు ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి సిబ్బందిని మోహరించనున్నారు.దాదాపుగా 2000 మంది భద్రతా బలగాలను తరలించనున్నారు.
Read Also: Gaganyaan Mission: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత్ తొలి వ్యోమగామి..ఎప్పుడంటే..?
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
బీఎస్ఎఫ్‌కి చెందిన రెండు బెటాలియన్లు తొలుత జమ్మూ కాశ్మీర్ రియాసి, కిష్టవార్, కథువాకు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొన్ని రోజుల తర్వాత 2000 మంది సైనికులతో కూడిన మరో రెండు బెటాలియన్లను జమ్మూలో మోహరించనున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గత కొన్ని రోజలుగా ఉగ్రదాడులు ఎక్కువైన కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తో్ంది.
శనివారం కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ) జరిపిన దాడిని భారత సైన్యం అడ్డుకుంది. ఈ పోరులో ఒక భారతీయ సైనికుడు మరణించగా, మరో నలుగురు కూడా గాయపడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో పాకిస్తాన్‌కి చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యారు. పాక్ బీఏటీ దళంలో పాక్ సైనికులు, ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో జిల్లాలోని కమ్కారి ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. అంతకుముందు జూలై 24న కుప్వారాలోని లోలాబ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టాయి. ఈ పోరులో ఓ జవాన్ అమరుడయ్యాడు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!