Rajouri terror attack: పీఓకే నుంచి రాజౌరి ఉగ్రదాడి.. లష్కర్ తీవ్రవాది సజ్జిద్ జుట్ హస్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajouri terror attack: జమ్మూ కాశ్మీర్ లో ఏడు నుంచి తొమ్మిది మంది ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతాబలగాలు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాయి. హెలికాప్టర్లు, డ్రోన్లతో సరిహద్దుల్లోని అడవులను స్కాన్ చేస్తున్నాయి. శుక్రవారం జరిగిన రాజౌరీ ఎన్ కౌంటర్ లో ఐదుగురు జవాన్లు మరణించడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు సైన్యం ఉగ్రవాదుల కోసం వెతుకుతోంది. ఇప్పటికే రాజౌరీతో పాటు బారాముల్లాలో ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి.
ఈ ఉగ్రదాడుల వెనక నిషేధిత లష్కరేతోయిబా ఉగ్రసంస్థ ఇంటెలిజెన్స్ తేల్చింది. రాజౌరీ-పూంచ్ సెక్టార్‌లో స్థానికుల మద్దతుతో రెండు గ్రూపుల లష్కరేతోయిబా ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తాజాగా శుక్రవారం రాజౌరీలో 9 పారా కమాండోలపై దాడిని బట్టి చూస్తే .. ఈ ప్రాంతంలో ఇద్దరు పాకిస్తానీలతో పాటు ఐదుగురు ఉగ్రవాదులతో కూడిన బృందం ఉండవచ్చని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.
Also Read
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
Read Also: The Kerala Story : ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు ఫస్ట్ డే మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని కోట్లీ నుంచి జమ్మూ రియాసి నివాసి అయిన రియాజ్ అహ్మద్ అలియాస్ ఖాసీమ్ తో పాటు లష్కర్ కమాండర్ హబీబుల్లా మాలిక్ అలియాస్ సజ్జిద్ జుట్ అలియాస్ సజ్జిద్ లాంగ్డా ఈ ఉగ్రదాడులను ఆపరేట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం లాహోర్ లోని మురిద్కే ప్రాంతంలోని లష్కరేతోయిబా ప్రధాన కార్యాలయం నుంచి పథక రచన చేస్తున్నారని భద్రతా సంస్థల వద్ద సమాచారం ఉంది. దీంతో పాటు పూంచ్ లోని మెందార్ నివాసి రఫీక్ నాయ్ అలియస్ సుల్తాన్ కూడా ప్రస్తుతం పాకిస్తాన్ లోనే ఉన్నాడు. దక్షిణ కాశ్మీర్ లో రిక్రూట్మెంట్, ఆయుధాల స్మగ్లింగ్, టెర్రర్ ఫైనాన్స్ వంటి ఉగ్రవాద కార్యకలాపాలకు వీరు పాల్పడుతున్నారు.
ఈ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్-పీఓకే సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాలను సురక్షిత స్థావరాలుగా మార్చుకుంటున్నారు. సజ్జిద్ జట్ మాడ్యూల్ 2021లో భాటా ధురియన్ అటవీ ప్రాంతంలో భారత ఆర్మీ దళాలపై దాడి చేసింది. ఈ ఉగ్రదాడిలోొ 9 మంది భారత జవాన్లు మరణించారు. ఇదిలా ఉంటే తాజాగా ఉగ్రదాడులు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆర్మీ కమాండర్లు, ఉన్నతాధికారులు ఈ రోజు శ్రీనగర్ వెళ్తున్నారు.
తాజావార్తలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!