MP DK Aruna: పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో.. బీజేపీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మీ దేశం మిగలదని మన సైనికులు సంకేతం ఇచ్చారు.. ఉగ్రవాదులను, దుండగులను ఐక్యతతో అంతం చేస్తామని తేల్చి చెప్పారు.
నరేంద్ర మోడీ పాలనలో భారత జాతి ప్రపంచంలో తలెత్తుకొని తిరుగుతుంది అని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అభివృద్ధి చెందుతోంది.. ఉగ్ర కుట్రలకు ప్రతిఫలం ఏంటో పాకిస్తాన్ చూసింది.. మా దేశ సమగ్రతను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తే ఎవ్వరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని సంకేతాలు పాకిస్తాన్ కు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.
Bomb Threat : ఆపరేషన్ సింధూర్’ విజయంతో దేశమంతా ఉత్సాహంగా ఉన్న వేళ, రాజస్థాన్‌లోని జైపూర్‌లో మాత్రం భయానక వాతావరణం నెలకొంది. సవాయ్ మాన్‌సింగ్ (SMS) స్టేడియంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ రావడంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. రాజస్థాన్ రాష్ట్ర క్రీడా మండలికి ఈ బెదిరింపు సందేశం మెయిల్ ద్వారా ఉదయం 9:13 గంటల ప్రాంతంలో అందింది. “ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా మీ స్టేడియంలో బాంబు పేలుస్తాం” అంటూ ఆ మెయిల్‌లో హెచ్చరించడంతో…
India vs Pak : ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత-పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడ్డ విషయం అధికారికంగా భారత సైన్యం ధృవీకరించింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ దినేష్ కుమార్ వీరమరణం పొందారు. దినేష్ కుమార్ మృతిపై వైట్ నైట్ కార్ప్స్ సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఇదే కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.…
అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నామంటే ఈరోజు కంటే ప్రత్యేకమైన రోజు మరి ఏది ఉండదలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో మోడీని ఎప్పుడు కలిసిన చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని.. కానీ మొన్నటి సమావేశంలో అమరావతికి రమ్మని పిలవడానికి వెళ్తే.. తమ భేటీ చాలా గంభీరంగా సాగిందని గుర్తు చేశారు.
ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. పదేళ్ల క్రితం 2015 అక్టోబరు 22న అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం మొదలైంది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాలోకేష్ మాట్లాడారు. పహల్గాం దాడిలో అమరులైన టూరిస్టుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేదిక మీద నుంచి పాకిస్థానీయులను హెచ్చరించారు.
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది తామే అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టె్న్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది. అయితే, పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులే, 2024లో జరిగిన Z-మోర్హ్ టన్నెల్ ప్రాజెక్ట్‌పై దాడికి పాల్పడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
Nabha Natesh : పహల్గాంలో ఉగ్రవాదుల దాడిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది దీనిపై సీరియస్ గా స్పందిస్తున్నారు. అటు సినీ సెలబ్రిటీలు కూడా వరుసగా మాట్లాడుతున్నారు. తాజాగా గ్లామర్ బ్యూటీ నభానటేష్ కూడా దీనిపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తనను తీవ్రంగా కలిచి వేసిందని చెప్పింది. తాను ఏడాది క్రితం పహల్గాంలో షూటింగ్ చేసినట్టు తెలిపింది. ఆ అందమైన ప్రదేశంలో ఎన్నో సార్లు షూటింగ్స్…
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడితో భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాయాది దేశానికి భారత్ తగిన సమాధానం ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో పీవోకేలో గల ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను పాకిస్థాన్ సైన్యం ఖాళీ చేయిస్తుంది.
CM M K Stalin: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడి తమిళనాడు రాష్ట్రంలో జరగదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఇక, మతతత్వం ఎన్నటికీ తమిళనాడును ఆక్రమించదని తేల్చి చెప్పారు.