Terror attack: కెనడాలో జనాలపైకి దూసుకెళ్లిన కారు.. ఉగ్రదాడిగా అనుమానం..
- కెనడా వాంకోవర్‌లో ఉగ్రదాడి..?
- జనాలపైకి కారుతో దూసుకెళ్లిన నిందితుడు..
- పదుల సంఖ్యలో మరణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror attack: శనివారం రాత్రి కెనడాలో ఘోర సంఘటన జరిగింది. వాంకోవర్‌లో జరిగి ఓ ఫెస్ట్‌లో దుండగుడు జనాలపైకి కారును వేగంగా నడిపి, దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. చాలా మంది గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని 30 ఏళ్ల వాంకోవర్ వాసిగా గుర్తించారు. కారు డ్రైవర్ ఒక ఆసియా యువకుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మరణించిన వారి సంఖ్యను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. దాడికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోడ్డుపై మృతదేహాలు చెల్లచెదురుగా పడి ఉన్నట్లు వీడియోలు చూపిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ వారసత్వం మరియు సంస్కృతిని జరుపుకునే లాపు లాపు డే ఉత్సవంలో ఈ దాడి జరిగింది. దీనిపై వాంకోవర్ మేయర్ కెన్ సిమ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
Read Also: CM Siddaramiah: ‘‘పాకిస్తాన్ రత్న’’.. పాకిస్తాన్‌లో సంచలనంగా సిద్ధరాయమ్య కామెంట్స్..
సంఘటన వెనక ఉన్న ఉద్దేశ్యాన్ని స్థానిక అధికారులు ఇంకా నిర్ధారించనప్పటికీ, ప్రాథమికంగా దీనిని ఉగ్ర దాడిగా అనుమానిస్తున్నారు. యూరప్, యూఎస్, కెనడాలో ఇలాంటి దాడులు ఇంతకుముందు జరిగాయి. ఈ ఘటనలో నిందితులు మతోన్మాదంతో దాడికి పాల్పడినట్లు గుర్తించారు.
ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా, 42 ఏళ్ల అమెరికన్ వ్యక్తి షంసుద్-దిన్ జబ్బర్ తన పికప్ ట్రక్కును న్యూ ఓర్లీన్స్‌లోని రద్దీగా ఉండే వీధిలో నడిపాడు. ఈ దాడిలో 14 మంది మరణించారు. 57 మంది గాయపడ్డారు. చివరకు నిందితుడిని పోలీసులు కాల్చి చంపారు. అతడి కారు నుంచి ఐసిస్ జెండాను స్వాధీనం చేసుకున్నారు. బెర్లిన్ లండన్, న్యూయార్క్ వంటి నగరాల్లో ఇలాంటి దాడులు జరిగాయి.
Initial reports of several killed and over a dozen injured, after an SUV plowed into a closed-off street filled with people celebrating the Lapu Lapu Festival in Vancouver, Canada. pic.twitter.com/cLQQPfOMCq
— OSINTdefender (@sentdefender) April 27, 2025
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!