Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి వెనుక పాక్ లష్కరే (LET) కమాండర్ సైఫుల్లా కసూరి పేరు బయటకు వచ్చింది. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఇతడు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. కాగా, కసూరి ప్రస్తుతం లష్కరే పెషావర్ ప్రధాన కార్యాలయానికి అధిపతి, అతడిని మిల్లీ ముస్లీంలీగ్ సంస్థకు అధ్యక్షుడిగా కూడా చెబుతుంటారు. ఇది హఫీజ్ సయీద్‌కు చెందిన జమాత్ ఉద్ దవాకు రాజకీయ విభాగంగా ఉంది. ఈ జమాత్ విభాగం పంజాబ్ ప్రావిన్స్ సమన్వయ విభాగం కూడా ఈ ఉగ్రవాదే చూస్తున్నాడు. ప్రస్తుతం జేయూడీని అమెరికా విదేశాంగ శాఖ లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా గుర్తించి.. ఉగ్ర ముద్ర వేసింది.
Read Also: Gorantla Madhav: నల్లపాడు పోలీస్ స్టేషన్ కు గోరంట్ల మాధవ్.. విచారించనున్న పోలీసులు..
అయితే, ఈ దాడిలో ఉగ్రవాదుల బృందానికి నాయకత్వం వహించింది ఆసీఫ్ ఫౌజీగా భద్రతా దళాలు అనుమానిస్తున్నారు. కాగా, లాష్కరే కమాండర్ సైఫుల్లా ప్లాన్ ను టీఆర్ఎఫ్ నాయకుడు ఆసిఫ్ ఫౌజీ అమలు చేసినట్లు గుర్తించారు. పాక్ నుంచి చొరబడ్డ ఉగ్రవాదులు దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిలో ఆసిఫ్ తో పాటు సులేమాన్ షా, అబూ తాహాలు పాల్గొన్నట్లు గుర్తించారు. ఈ ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులు ముజఫరాబాద్‌లోని సేఫ్ హౌస్‌లోకి వెళ్లినట్లు సమాచారం.
Read Also: Jammu Kashmir: కుల్గామ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్..
అయితే, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ ద్వారా కాశ్మీర్ యువతను టీఆర్ఎఫ్ తమ వైపుకు తిప్పుకుంటుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత టీఆర్ఎఫ్ ఏర్పడింది. ఈ టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ వెనక ఉండి లాష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి ఉన్నట్లు భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నాయి. ఈ టీఆర్ఎఫ్ సంస్థను ఉపా చట్టం కింద భారత ప్రభుత్వం నిషేధించింది.