ఉమ్మడి నల్లగొండజిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి చేరిక.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోందా? ఆయన రాజకీయ భవిష్యత్‌పై ఇంకా క్లారిటీ లేకపోయినా.. ఎమ్మెల్యేలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? కలవర పడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు?
మోత్కుపల్లి చేరికతో.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు..!
Also Read
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గులాబీ కండువా కప్పుకొన్న తర్వాత.. ఆ చేరిక ప్రకంపనలు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కనిపిస్తున్నాయి. పైకి ఎవరూ చెప్పకపోయినా.. కొందరు ఎమ్మెల్యేలు తమకేమైనా గండం పొంచి ఉందా అని ఆరా తీస్తున్నారట. మోత్కుపల్లి తనకు అత్యంత సన్నిహితమని.. ఇద్దరం కలిసి చాలా ఏళ్లు కలిసి పనిచేశామని సీఎం కేసీఆర్ చెప్పడంతో.. ఆ మాటల ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుందో తెలియక దిగులు చెందుతున్నారట ఎమ్మెల్యేలు.
సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనలో మోత్కుపల్లికి ప్రాధాన్యం..!
మోత్కుపల్లి గతంలో ఆలేరు, తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అక్కడ కుదురుకోలేదు. దళితబంధు బ్యాక్‌డ్రాప్‌లో కాషాయాన్ని వీడి.. గులాబీ శిబిరానికి దగ్గరయ్యారు. సీఎం కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు ఈ మాజీ మంత్రి. ఇప్పుడు మోత్కుపల్లికి టీఆర్‌ఎస్‌లో ఇచ్చే ప్రాధాన్యంపై ఆసక్తి నెలకొంది. కండువా కప్పిన మరుసటి రోజే సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనలో మోత్కుపల్లి ఆయన పక్కనే కనిపించారు. ఆ దృశ్యాలు చూశాక ఎమ్మెల్యేలకు ఇంకా టెన్షన్ పెరిగిందట.
ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఒక్కటే చర్చ..!
దళితబంధు కార్పొరేషన్‌కు మోత్కుపల్లిని ఛైర్మన్‌ను చేస్తారో లేక ఎమ్మెల్సీని చేస్తారో క్లారిటీ లేదుకానీ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటే.. పరిస్థితి ఏంటన్న చర్చ అయితే మొదలైంది. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు తుంగతుర్తి, నకిరేకల్ ఉన్నాయి. ఆలేరు జనరల్ స్థానం. వీటిల్లో ఏదోఒకటి మోత్కుపల్లికి కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆంతరంగిక సమావేశాల్లో చర్చిస్తున్నారట. అంత సీన్ లేదన్నది మరికొందరి వాదన. నామినేటెడ్ పదవి కట్టబెట్టి దాని వరకే మోత్కుపల్లిని పరిమితం చేస్తారని చెబుతున్నారట. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ముందుగానే ఒక అంచనాకు రాకుండా.. తమ కాళ్ల కిందకు నీళ్లొచ్చే ఛాన్స్ ఏదైనా ఉందా అని తెలిసిన వారి దగ్గర ఆరా తీస్తున్నారట ఎమ్మెల్యేలు. మరి.. ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు