కర్నూలు జిల్లా శ్రీశైలం ముఖద్వారం సమీపంలో పెద్దపులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రోడ్డు దాటుతూ ప్రయాణికులకు పెద్ద పులి కనిపించింది. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు.
వాహనాలు నిలిపివేసి ఫోటోలు, వీడియోలు తీసిన ప్రయాణికులు. ఎన్టీవీ చేతిలో వీడియోలు వున్నాయి. పెద్ద పులి ఎటు నుంచి ఎటు వెళ్ళిందోనని టెన్షన్ పడుతున్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.