కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్‌తో ఆయన కాల్చుకు బలవన్మరణానికి పాల్పడినట్టు చెబుతున్నారు. అధికారులు మాత్రం.. మిస్ ఫైర్ జరిగి ఎస్సై మృతి చెందారని చెబుతున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు తర్వాతే ఎస్సైది ఆత్మహత్యనా? మిస్ ఫైర్ జరిగి మృతి చెందారా? అనేది తేలుతుందని అంటున్నారు.
ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య పై ఎస్పీ రవీంద్ర నాధ్ బాబు మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న గోపాలకృష్ణ గతంలో వీ ఆర్ ఓ గా పని చేసాడని, ఎస్సై ఆత్మహత్య పై విచారణ కొనసాగుతోందన్నారు. విచారణాధికారిగా ఎస్ బీ డీఎస్పీ వెంకటేశ్వరరావు ను నియమించామన్నారు. ఆత్మహత్య చేసుకున్నపుడు భార్య మాత్రమే ఇంట్లో ఉంది. ఎటువంటి గొడవలు జరగలేదని భార్య చెబుతోందన్నారు. డైరీ లో సూ సైడ్ నోట్ దొరికింది..దానికి సంతకం లేదు.. విచారణ చేస్తున్నామన్నారు. ఆత్మహత్య వెనుక కారణాలు ఏమైనప్పటికి విచారణ వేగవంతం చేస్తామన్నారు.
విచారణ లో అన్ని విషయాలు బయట పెడతాయన్నారు. పోలీస్ జాబ్ మొదటి నుంచి గోపాలకృష్ణకు ఇష్టం లేదు..పేరెంట్స్ ఒత్తిడి మేరకు జాయిన్ అయ్యాడు. ఇదిలా వుంటే… కాకినాడ జీ జీ హెచ్ కి చేరుకున్నారు ఎస్సై గోపాలకృష్ణ భార్య పావని , బంధువులు. పోస్టుమార్డంకి ముందు ఫార్మాలిటీలు పూర్తి చేయిస్తున్నారు డాక్టర్లు.
SI Suicide: గన్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య