బాపట్ల జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో బెల్ట్ షాపు నిర్వహణ, నాటుసారా అమ్మకాలకు వేలంపాట నిర్వహించారు. అయితే గ్రామంలోని అధికారులు ఈ వేలంపాట నిర్వహించిన విధానం ఇప్పుడు విమర్శల పాలవుతోంది. గ్రామంలోని ఓ ఆలయంలో వేలంపాట నిర్వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. లిక్కర్ షాపు కోసం ఆలయంలో వేలం పాట నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో లిక్కర్ షాపు కోసం వేలం పాట పెట్టి ఓ వర్గాన్ని అవమానపరిచారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వేలం పాటలో…
సిద్దిపేట రూరల్ మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించారు. మండలంలోని రాఘవాపూర్, బచ్చాయిపల్లిలో బీజేపీ జెండాను ఆవిష్కరించిన పెద్దమ్మతల్లి దేవాలయంలో దుబ్బాక ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.. ఏళ్ల కొద్దీ ఏలుతున్న పార్టీల పునాదులు కదులుతున్నాయని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. గడిచిన ఎనిదేళ్లలో బచ్చాయిపల్లికి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూంలు ఎన్ని వేశారు? అంటూ మండిపడ్డారు. సీసీ రోడ్లు ఎన్ని? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.…
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి శ్రీ వకుళమాత ఆలయం, (పాతకాల్వ (పేరూరు), తిరుపతి) ప్రారంభోత్సవానికి ఆహ్వనించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏ.వి. ధర్మారెడ్డి. ఈ నెల 23న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 18 న అంకురార్పణతో మొదలై 23 వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలు, 23 న మహా సంప్రోక్షణ ఆవాహన, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతాయి. ఆహ్వానపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు…
ప్రపంచం మొత్తం టెక్నాలజీలో దూసుకుపోతోంది.. ఏ కొత్త టెక్నాలజీ వచ్చిన భారత్‌లోనూ విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఓ అత్యవసర కేసు విచారణలో ఇప్పుడే అదే కీలకంగా పనిచేసింది.. దేశ హైకోర్టు చరిత్రలోనే తొలిసారిగా ఓ న్యాయమూర్తి వాట్సాప్ ద్వారా కేసును విచారించి వార్తల్లో నిలిచారు.. వాట్సాప్ ద్వారా కావడంతో సెలవు రోజున కూడా కేసు విచారణ సులభంగా సాగిపోయింది.. కాగా, సోషల్ మీడియాలో వాట్సాప్ యాప్ ప్రస్తుతం ప్రముఖ పాత్ర పోషిస్తోంది.. స్మార్ట్ ఫోన్ ఉంటే.. అందులో వాట్సాప్…
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో స్వామి వారి జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం మూల మాస్త్ర హావనములు, పూర్ణాహుతి, సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించి, సాయంత్రం నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావంతో జయంతి ఉత్సవాలు ముగుస్తాయి. రేపటి నుండి సుదర్శన నరసింహ హోమం, నిత్యా, శాశ్వత కళ్యాణం, నిత్యా, శాశ్వత బ్రహ్మోత్సవం పునఃప్రారంభం కానున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. కాగా.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో రెండు రోజులుగా కన్నుల పండువగా జయంత్యుత్సవాలు…
ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సహస్ర కలశాభి షేకం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు శ్రీ స్వామి వారలకు పురుషసూక్త, శ్రీ సూక్త, కల్పోక్త, వ్యాసపూర్వక, శోడషోపచార పూజ, సహస్ర నామార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పంచోపనిషత్తులచే మన్యసూక్త, రుద్రాభి షేక పూజలు, సహస్ర కలశాభి షేకం, ప్రత్యేక పూజలు, అర్చనాది ఆరాధన, హారతి…
విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. సింహాచలం ఆలయంలో స్వామివారి చందనోత్సవంలో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు తమిళిసై. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం లభించడం మహాభాగ్యం అన్నారు తమిళిసై. తొలిసారి చందనోత్సవంలో పాల్గొన్నాను. ఇక్కడ వరాహ లక్ష్మీనరసింహస్వామి పవర్ ఫుల్ గాడ్, ఆలయంలో అడుగు పెడితేనే వైబ్రేషన్స్ ఉన్నాయ్ అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళసై.కొండపై స్వామివారి చందనోత్సవంకు క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. సాయంత్రం వరకు…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కాబోయే భర్త పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా రావికమతంలో వరుడు పై వధువు చాకుతో దాడిచేసిన సంగతి తెలిసిందే. వరుడు రామునాయుడు పై తానే దాడి చేసినట్లు ఒప్పుకుంది వధువు పుష్ప. భక్తి మైకంలో ఉన్న పుష్ప ..తనకు పెళ్ళి వద్దంటు తను దేవుని భక్తురాలిగా ఉంటానంటూ పలు మార్లు తల్లిదండ్రులకు తెలిపింది. ఇప్పటికి రెండు పెళ్లి చూపులు కాన్సిల్ కావడంతో మూడవది ఒప్పించారు తల్లిదండ్రులు.…