ఉత్తరాఖండ్ పేరు వినగానే మనకు చార్‌ధామ్ యాత్ర గుర్తుకు వస్తుంది. ఉత్తరాఖండ్‌ను దేవభూమిగా పిలుస్తారు. కేదారినాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఇలా ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అయితే, 2019లో అప్పటి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చార్‌ధామ్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు కింద మొత్తం 51 దేవాలయాలను తీసుకొచ్చింది. అయితే, ఈ బోర్డు ఏర్పాటు కారణంగా తమ సంప్రదాయ హక్కుల ఉల్లంఘన జరుగుతందని పూజారులు ఆందోళన చేస్తున్నారు. ఈ బోర్డు చట్టాన్ని రద్దు…
కులాలు, మతాలు అనే తేడా లేకుండా నివసిస్తోన్న హైదరాబాద్ నగరంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. దళిత మహిళను కులాంతర వివాహం చేసుకున్నందుకు ఓ వ్యక్తి ఆ కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆలయ బహిష్కరణ చేశారు దేవాలయ నిర్వాహకులు. ఘటన హైదరాబాద్ శివారులోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురం శ్రీ పద్మావతి సమేతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నక్క యాదగిరి గౌడ్ గత 14 ఏళ్లుగా పని చేస్తున్నాడు. అయితే, యాదగిరిగౌడ్…
భారీవర్షాలు బీభత్సం కలిగిస్తున్నాయి. కపిల తీర్థం వద్ద వరద నీరు కలకలం రేపుతోంది. తిరుమల కొండపై నుంచినీటి ప్రవాహం కొనసాగుతుండడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. జలపాతం నుంచి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. నీటి ప్రవాహం ధాటికి కూలిపోయింది పురాతన మంటపం. గడిచిన మూడు రోజులుగా కూలుతూ వస్తున్న మంటపం, గత రాత్రి మరింతగా కూలిపోయింది. దీంతో కపిలతీర్థంలోకి ఎవరినీ అనుమతించడం లేదు టీటీడీ అధికారులు. కపిలతీర్థం శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. దీనినే చక్రతీర్థం…
నేటి నుంచి శమరిమల అయ్యప్ప ఆలయంలోకి భక్తుల దర్శనానికి అధికారులు అనుమతి ఇచ్చారు. రోజుకు 30 వేల మంది భక్తులను అనుమతించనున్నారు. ఇక అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా టీకా సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలి. డిసెంబర్ 26వ తేదీతో అయ్యప్ప మండల పూజ ముగియనున్నది. మండల పూజ అనంతరం మకరజ్యోతి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమల వస్తుంటారు. మకరజ్యోతి పూర్తైన తరువాత జరవరి 20 వ తేదీన…
విగ్రహాలు పాలు తాగడం, విభూతి రాల్చడం వంటి వాటి గురించి గతంలో విన్నాం. వాటిపై వచ్చిన కథనాలు చదివాం. కంచిలోని నటరాజ స్వామి వారి ఆలయంలోని విగ్రహానికి చెమట్లు పడుతుంటాయనే సంగతి ఆ దేవాలయాన్ని దర్శించిన భక్తులకు తెలుసు. అలా ఎందుకు జరుగుతుందనేది రహస్యం. ఎవరూ చెప్పలేకపోతున్నారు. కాగా, ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని కొనకమిట్ల మండలంలో మునగపాడు గ్రామంలో రామాలయం ఉంది. ఆ ఆలయంలోని రాములవారి విగ్రహం కంటి నుంచి నీరు కారుతున్నది. Read: రియల్…
కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం. అన్నవరంలో వెలపిన సత్యదేవుడిని దర్శించుకోవడంతో ఎంతో అనుభూతి పొందుతారు భక్తులు. కేంద్ర ప్రభుత్వం ప్రేవేశ పెట్టిన ప్రసాద్ పథకంలో ఈసారి అన్నవరం దేవస్థానానికి చోటు దక్కింది. సుమారు 50 కోట్ల రూపాయల నిధులు సత్యదేవుని కొండ అభివృద్ధికి కేటాయించడం జరిగింది. ఇప్పటికే అన్నవరం దేవస్థానం ప్రసాద్ పథకం ద్వారా భక్తుల సౌకర్యాల నిమిత్తం చేపట్టే అభివృద్ధి పనులకు రూపకల్పన చేశారు. అందులో భాగంగా టూరిజం…
భారత్ పాక్ మధ్య గత కొంత కాలంగా ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. బోర్డర్‌లో నిత్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఇక పాకిస్తాన్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఆ దేశంలో ఒక్క కొత్త హిందూ దేవాలయం కూడా నిర్మంచలేదు. 75 ఏళ్ల కాలంలో వందలాది దేవాలయాలను కూల్చివేశారు. పాక్‌లో హిందూవులు మైనారిటీలు కావడంతో దేవాలయాలను కూల్చి వేస్తున్నా ఏమి చేయలేని పరిస్థితి. Read: డిసెంబర్ 1 నుంచి పెరగనున్న ఆటో ఛార్జీలు… కిలోమీటర్‌కు… 2016లో పాక్…
యాదాద్రి ఆలయం పునఃప్రారంభం కాబోతున్న తరుణంలో ఆలయంలోని విమాన గోపురం స్వర్ణమయం కాబోతున్నది. ఈ విమాన గోపురం స్వర్ణతాపడం కోసం అనేక మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ 2కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ను స్పూర్తిగా తీసుకొని అనేక మంది దాతలు బంగారాన్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కాసుమన్ కిలో బంగారం, జలవిహార్ ఎండీ కిలో బంగారం, హెటిరో గ్రూప్ 5 కిలోల బంగారం,…