ప్రపంచం మొత్తం టెక్నాలజీలో దూసుకుపోతోంది.. ఏ కొత్త టెక్నాలజీ వచ్చిన భారత్‌లోనూ విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఓ అత్యవసర కేసు విచారణలో ఇప్పుడే అదే కీలకంగా పనిచేసింది.. దేశ హైకోర్టు చరిత్రలోనే తొలిసారిగా ఓ న్యాయమూర్తి వాట్సాప్ ద్వారా కేసును విచారించి వార్తల్లో నిలిచారు.. వాట్సాప్ ద్వారా కావడంతో సెలవు రోజున కూడా కేసు విచారణ సులభంగా సాగిపోయింది.. కాగా, సోషల్ మీడియాలో వాట్సాప్ యాప్ ప్రస్తుతం ప్రముఖ పాత్ర పోషిస్తోంది.. స్మార్ట్ ఫోన్ ఉంటే.. అందులో వాట్సాప్ ఉండాల్సిందే అనే తరహాలో అది దూసుకు పోతోన్న విషయం తెలిసిందే.
Read Also:
Astrology: మే 17 మంగళవారం దినఫలాలు
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్ ఆదివారం ఓ వివాహ కార్యక్రమానికి నాగర్ కోయిల్‌కు వెళ్లాల్సి వచ్చింది.. అయితే, అక్కడే ఉండి వాట్సాప్ ద్వారా కేసు విచారించారు జీఆర్ స్వామినాథన్.. అయితే, తమిళనాడు ధర్మపురి జిల్లాలో అభీష్ట వరదరాజస్వామి రథయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కేసు అది.. రథయాత్రలో రథానికి విద్యుత్ తీగలు తగిలి అగ్నిప్రమాదం సంభవించింది.. ఈ ప్రమాదంలో 11 మంది భక్తులు విడిచారు.. దాదాపు 20 మంది వరకు గాయాలపాలయ్యారు.. దీంతో రథ యాత్ర నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.. ఇక, అభిష్ఠ వరదరాజ స్వామి ఆలయంలో సోమవారం రథయాత్ర జరగాల్సి ఉండగా.. కోర్టును ఆశ్రయించారు.. దీంతో వివాహ వేడుక నుంచే జస్టిస్ జీఆర్ స్వామినాథన్ వాట్సాప్ ద్వారా కేసు విచారణ జరిపారు.. వాట్సాప్‌లోనే ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. రథయాత్రను నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చారు. ఇదే సమయంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.