శ్రీశైలంలో సమావేశమైన ధర్మకర్తల మండలి 25 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. శ్రీశైలంలో ట్రస్ట్ బోర్డ్ ఆరవ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆలయ ఈవో లవన్న, మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొత్తం 30 అంశాలతో ప్రతిపాదనలు ప్రవేశపెట్టగా 25 ప్రతిపాదనలను ఆమోదం తెలిపి 5 ప్రతిపాదనలకు వాయిదా వేసినట్లు ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా క్షేత్ర అభివృద్ధి,కొన్ని చోట్ల రోడ్లు,విద్యుత్ కు ఆమోదం తెలిపినట్టు చైర్మన్ చెప్పారు.
Read Also:
Tirumala: తిరుమల భక్తులకు గమనిక.. బ్రహ్మోత్సవాలకు వాటిని తీసుకురావొద్దు..!!
అలానే అటవీశాఖ మంత్రితో మాట్లాడి త్వరలో శ్రీశైల పరిధి అటవీ సరిహద్దులు నిర్మిస్తామన్నారు. పడితరం స్టోర్ లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని త్వరలోనే ధరలు నిర్ణయించి టెండర్ లు పిలుస్తామన్నారు. శ్రీశైలం క్షేత్ర అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా నిధులు ఆడిగామని సీఎం కూడా సుముఖత వ్యక్తం చేశారని ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో లవన్న ట్రస్ట్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.
Read Also: Gujarat: అత్యాచారం కేసులో ఆప్ నేత అరెస్ట్