యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో స్వామి వారి జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం మూల మాస్త్ర హావనములు, పూర్ణాహుతి, సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించి, సాయంత్రం నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావంతో జయంతి ఉత్సవాలు ముగుస్తాయి. రేపటి నుండి సుదర్శన నరసింహ హోమం, నిత్యా, శాశ్వత కళ్యాణం, నిత్యా, శాశ్వత బ్రహ్మోత్సవం పునఃప్రారంభం కానున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.
కాగా.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో రెండు రోజులుగా కన్నుల పండువగా జయంత్యుత్సవాలు జరిగాయి. శనివారం (14)న కాళీయమర్థిని అలంకారంలో భక్తులకు స్వామి వారు దర్శనమిచ్చారు. ఆలయ మాడ వీధిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశాయి. వేద పారాయణాలు, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ నరసింహుడి జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
శనివారం కాళీయమర్థిని అలంకారంలో ఆలయ మాడవీధిలో ఊరేగుతూ భక్తులకు నారసింహుడు కనువిందు చేశారు. స్వామివారికి మంగళ నీరాజనం, మంత్రపుష్పములతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన స్వామివారి జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.
Andhra Pradesh: రైతులకు శుభవార్త.. రేపు వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు జమ